Advertisementt

అంజ‌లి సోద‌రి.. ఆరాధ్య‌.. ఆగమనం!

Sat 23rd Sep 2017 08:38 PM
anjali sister,aradhya,aradhya cine entry,anjali sister about her cine entry,prabhas,jayasudha  అంజ‌లి సోద‌రి..  ఆరాధ్య‌.. ఆగమనం!
Anjali Sister Aradhya About Her Cine Entry అంజ‌లి సోద‌రి.. ఆరాధ్య‌.. ఆగమనం!
Advertisement
Ads by CJ

వెండితెర‌పై ఎంట్రీ ఇస్తున్న అంజ‌లి సోద‌రి.. ఆరాధ్య‌!

క‌థానాయిక‌ల చెల్లాయిలు.. వెండి తెర‌పై అడుగుపెట్ట‌డం, త‌మ స‌త్తా చాటుకోవ‌డం చూస్తూనే ఉన్నాం. ఆ జాబితాలో మ‌రో అమ్మాయి చేరింది. త‌నే అంజ‌లి సోద‌రి.. ఆరాధ్య‌. తాను కూడా అక్క‌లా వెండి తెర‌పై రాణిస్తాన‌ని ధీమాగా చెబుతోంది. శ‌నివారం సాయింత్రం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడింది ఆరాధ్య‌. 

చిన్న‌ప్ప‌టి నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. నీ క‌ళ్లు బాగుంటాయి.. సినిమాల్లోకి వెళ్లొచ్చు క‌దా?  అని స‌న్నిహితులు చెప్పేవారు. అక్క అంజ‌లి సినిమాల్లో రాణించింది. తన‌ని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా అడుగుపెట్టా. అక్క తెలుగు చిత్ర‌సీమ‌లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకొంది.  అదృష్టం అనే దానికంటే అక్క ప‌డిన క‌ష్ట‌మే.. త‌న ఉన్న‌తికి కార‌ణం. మా అమ్మ కూడా త‌న‌కి బాగా స‌పోర్ట్ చేసింది. అమ్మ స‌హ‌కారం ఉంటుంద‌న్న ధైర్యంతోనే నేనూ చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టా. చిన్న‌ప్పుడే నృత్యం నేర్చుకొన్నా. సినిమాకి ఏమేం కావాలో... వాటిపై శిక్ష‌ణ పొందా. న‌టిగా నాకు పేరొచ్చే ఎలాంటి పాత్ర అయినా చేస్తా. పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా క‌నిపిస్తా. గ్లామ‌రా, న‌ట‌న‌.. అనేదానికంటే మంచి పాత్ర‌లు, మంచి క‌థ‌లే ముఖ్యం. ప్ర‌స్తుతం త‌మిళంలో ఓ చిత్రంలో న‌టిస్తున్న, స‌ముద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగులోనూ ఓ సినిమా చేస్తున్నా. ఒక‌ట్రెండు సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.. అంటోంది. 

ఆరాధ్య‌కి ఇష్ట‌మైన న‌టుడు ఎవ‌రు అని అడిగితే.. 'ప్ర‌భాస్' అని చెబుతోంది. బాహుబ‌లికంటే ముందే.. ఈశ్వ‌ర్ స‌మ‌యం నుంచే ప్ర‌భాస్ అభిమానిని. క‌థానాయిక‌ల విష‌యానికొస్తే జ‌య‌సుధ‌గారిని బాగా ఇష్ట‌ప‌డ‌తా. నా ఆల్‌టైమ్ ఫేవ‌రెట్ న‌టి ఆమె.. అంటోంది. 

Anjali Sister Aradhya About Her Cine Entry :

Heroine Anjali Sister Aradhya Enters Cine Field

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ