బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన 'జై లవ కుశ' చిత్రం గురువారం థియేటర్స్ లోకి వచ్చింది. ఎన్టీఆర్.. జై, లవ, కుశ గా త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం మొదటి రోజు కోట్లు కొల్లగొట్టి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన మూడు పాత్రల్లోకెల్లా జై పాత్రకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. జై పాత్రలోని కోపం, రావణ్ గా జై పాత్ర చేసిన అరాచకాలు, జై మాట్లాడే నత్తి డైలాగ్స్, జై ఉగ్ర రూపం, ఎప్పటికప్పుడు రావణుడిలా తనని తాను ఊహించుకోవడం, జై పాత్ర పలికించాల్సిన ఫేస్ ఎక్సప్రెషన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ జై పాత్రకు నూటికి నూరు శాతం మార్కులేసేస్తున్నారు ప్రేక్షకులు.
సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులంతా ఒకటే మాట జై సూపర్, జై అదుర్స్, జై ఇరగదీశాడు ఇవే మాటలు మాట్లాడుతున్నారు. సెకండ్ హాఫ్ జై అనే పాత్ర లేకపోతే సినిమానే లేదని... ఎన్టీఆర్ జై పాత్రను అంత సూపర్ గా చేశాడని సినీరంగ టాప్ సెలబ్రిటీస్ కూడా పొగిడేస్తున్నారు. ఇక కొందరు ప్రేక్షకులైతే జై పాత్రను క్లైమాక్స్ లో చంపకుండా లవ, కుశలతో సంతోషంగా ఉన్నట్లు చూపిస్తే బావుండేదనే అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక జై పాత్ర మేకింగ్ వీడియో చూశాక జై పాత్రలో జీవించడానికి ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డాడో అంటూ మోసేస్తున్నారు గాని.. ఎక్కడ దర్శకుడు బాబీ మాట వినబడడం లేదు. అసలు జై లవ కుశ అంటేనే జై... జై అంటేనే జై లవ కుశ అంటున్నారు గాని మిగతా ఎవ్వరి పేర్లు ఇక్కడ వినబడడం లేదు.
మరి జై లవ కుశ క్రెడిట్ మొత్తం జై పాత్రే పట్టుకుపోయింది. కానీ దర్శకుడు బాబీకిగాని, హీరోయిన్స్ రాశిఖన్నా, నివేత థామస్ గురించి గాని ఎక్కడా వినబడడంలేదు. అలాగే ఐటెం సాంగ్ లో తమన్నా డాన్స్ అస్సలు బాగోలేదని జై స్టెప్స్ మాత్రం సూపర్ అంటూ ఆ ఐటెం సాంగ్ క్రెడిట్ ని కూడా జై ఖాతాలోనే వేస్తున్నారు. మరో పక్క అసలు తమన్నా అలా ఆ ఐటెంలో ఎందుకు చేసింది..... అంతలా ఎక్స్ పోజ్ చేస్తూ డాన్స్ చెయ్యడం ఏమిటి అనే కామెంట్స్ కూడా పడుతున్నాయి.