Advertisementt

త్రివిక్రమ్‌, ఎన్టీఆర్ చిత్రంలో అవేమీ ఉండవ్!

Sat 23rd Sep 2017 08:04 PM
jr ntr,trivikram srinivas,jai lava kusa after movie,ntr and trivikram movie,martial arts  త్రివిక్రమ్‌, ఎన్టీఆర్ చిత్రంలో అవేమీ ఉండవ్!
No Martial Arts for NTR and Trivikram Film త్రివిక్రమ్‌, ఎన్టీఆర్ చిత్రంలో అవేమీ ఉండవ్!
Advertisement
Ads by CJ

ఎప్పటినుంచో ఎన్టీఆర్‌ అభిమానులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తే బాగుంటుందని ఆశపడుతూ వస్తున్నారు. ఎన్టీఆర్‌ చెప్పే డైలాగ్స్‌ పంచ్‌లకు త్రివిక్రమ్‌ రాసే డైలాగ్స్‌ తోడైన సంచలనం సృష్టించడం ఖాయమని బావిస్తూ వస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌కి ఎక్కువగా మాస్‌ ఇమేజ్‌ ఉంది. 'నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌'లతో ఆయన క్లాస్‌ ఇమేజ్‌ని తెచ్చుకున్నాడు. ఇక త్రివిక్రమ్‌ అంటే ఫ్యామిలీ బంధాలు, అనుబంధాలు, ఫ్యామిలీ సెంటిమెంట్స్‌ బాగా ఉంటాయి. ఇప్పటికే ఈ తరహాలో ఎన్టీఆర్‌ 'బృందావనం' చేశాడు. ఇక త్రివిక్రమ్‌తో చేస్తే ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మరింత క్రేజ్‌ రావడం ఖాయమనే చెప్పాలి. 

'జై లవకుశ' తర్వాత ఎన్టీఆర్‌ చేయబోయేది త్రివిక్రమ్‌తోనే అన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, పవన్‌కళ్యాణ్‌ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. దీంతో 'జై లవ కుశ'కు, త్రివిక్రమ్‌ చిత్రానికి మద్య చాలా గ్యాప్‌ రావడం ఖాయం. అందుకే ఈ సమయంలో ఎన్టీఆర్‌ తన ఫ్యామిలీతో విదేశీ ట్రిప్‌కి వెళ్లి రిలాక్స్‌ కావడంతో పాటు త్రివిక్రమ్‌ చిత్రం కోసం ఓ స్పెషల్‌ లుక్‌ని అనుకుంటున్నామని, దానిపై ఫైనల్‌ డెసిషన్‌ తర్వాత ఆ లుక్‌పై దృష్టి పెడతానని చెప్పాడు. ఇక ఈ చిత్రం కోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవడం కోసం ఎన్టీఆర్‌ మలేషియా వెళ్లనున్నాడు అనే విషయాన్ని ఎన్టీఆర్‌ కొట్టిపారేశాడు. ఇక డీటాక్సిఫికేషన్‌ తప్పేమీ కాదని, తాను మాత్రం అది చేయబోవడం లేదన్నాడు. 

No Martial Arts for NTR and Trivikram Film:

NTR Clarity on martial arts in his Next Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ