సూపర్‌స్టార్ మహేష్‌బాబు-రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా ఎస్.జె.సూర్య విలన్‌గా దేశంలోనే ప్రముఖ దర్శకుడు, దక్షిణాదిలో టాప్‌డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'స్పైడర్'. మరో వారం రోజుల్లో ఈ చిత్రం థియేటర్లలలో సందడి చేయనుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్, హారీస్‌జైరాజ్ అందిన సంగీతం, పాటలు అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా చిత్రం కోసం యూనిట్ ఓ కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో మహేష్‌బాబు గన్‌లో బుల్లెట్లు లోడ్ చేస్తున్న స్టిల్ కేకపుట్టిస్తోంది.
ఈ పోస్టర్‌ని చూస్తే నాటి మహేష్‌బాబు-పూరీ జగన్నాథ్‌ల దర్శకత్వంలో వచ్చి మహేష్ బాబుకి సూపర్‌స్టార్ ఇమేజ్‌ని తెచ్చి, తెలుగు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన 'పోకిరి' చిత్రంలోని స్టిల్ గుర్తుకు వస్తోంది. అయితే 'పోకిరి'లో మహేష్‌బాబు మాస్‌లుక్‌లో కనిపిస్తే, 'స్పైడర్'లో మాత్రం క్లాస్‌లుక్స్‌లో హాలీవుడ్ స్టార్‌లాగా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రెండు భారీ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ఎపిసోడ్స్‌లో మహేష్ నటనతో పాటు ఆయన లుక్, భారీ స్థాయిలో ఉపయోగించిన గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లు అత్యద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది.
అందుకే ముందు జాగ్రత్తగా ఈచిత్రంలోని టీజర్‌లో గానీ ట్రైలర్‌లో గానీ ఈ ఎపిసోడ్స్ చూపించకుండా మురుగదాస్ చర్యలు తీసుకున్నాడు. ట్రైలర్‌ను కూడా చాలా సాదాసీదాగా కట్ చేశాడు. మొత్తానికి ఈ చిత్రంలో ఐబి అధికారిగా మహేష్ చేసే సాహసాలు, ప్రజలను కాపాడటం కోసం ఆయన చేసే విన్యాసాలు ఈచిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. సో.. వచ్చే వారంలో అంటే ఈనెల 27న చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా సంచలనాలకు తెరతీయనుంది.