ఇప్పుడు ప్రతి సినిమా ఇండస్ట్రీలోని సినిమా అలా విడుదలవుతుందో లేదో ఇలా వెంటనే పైరసీ రక్కసి బయటికి వచ్చేస్తుంది. ఆ భాష ఈ భాష అని లేదు. ఏ భాషా సినిమా అయినా ఈ పైరసీ భూతానికి బలైపోతున్నాయి. ఇదివరకు ఈ పైరసీ అనేది తమళనాట ఎక్కువగా ఉండేది. కానీ రాను రాను అన్ని భాషల్లోనూ పైరసీ రక్కసి పాతుకుపోయింది. ఇక పైరసీ బారిన పడిన సినిమాల నిర్మాతలు అయితే ఘొల్లుమంటున్నారు. ఎంతో కష్టపడి సినిమా తియ్యడం... బోలెడు డబ్బు ఖర్చు పెట్టడం చూసిన ఈ పైరసీ భూతాన్ని ఇంకా జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఏం అనులోవాలి.
ఇక ఇప్పుడు ఈ పైరసీ భూతానికి తాజా గా విడుదలైన జై లవ కుశ కూడా చిక్కింది. ఎన్టీఆర్ హీరోగా త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ చిత్రం అలా థియేటర్స్ లో షో పడిందో లేదో ఇలా పైరసీ బయటకి వచ్చేసింది. ఎలా అంటే ఓవర్సీస్ లో ఒకరోజు ముందే జై లవ కుశ విడుదలయ్యింది. అలా ముందే విడుదలైన జై లవ కుశ థియేటర్ లో ఎవరు ఫోన్ తో జై లవ కుశాని బందించారో గాని జై లవ కుశ లోని కొన్ని సన్నివేశాలు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. మరి సినిమా థియేటర్ లోకి కెమెరాలు ఎలావుడ్ లేవు గాని మొబైల్స్ ని తీసుకేల్లోచ్చుగా. అలా మొబైల్స్ లో సినిమాలు షూట్ చేసేసి ఇలా ఇంటర్ నెట్ లో పెట్టేసి చిత్ర నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
మరి ప్రతి సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం అంతా పైరసీ భూతాన్ని ప్రోత్సహించ్చోద్దంటూ ఉంది. మరి జై లవ కుశ చిత్ర బృందం కూడా జై లవ కుశ ప్రమోషన్స్ లో ఈ పైరసీని అరికడదాం అని పిలుపునిచ్చినా ఆ సినిమా ఇప్పుడు నెట్ లో హల్చల్ చెయ్యడంతో చిత్ర బృందం షాక్ అయ్యింది. మరి ఆ పైరసీ అరికట్టడానికి చిత్ర బృందం రంగంలోకి దిగింది. కానీ ఒకచోట అరికట్టినా మరొక చోట ఆ పైరసీ జరగదనే గ్యారెంటీ లేదు. చూద్దాం ఈ పైరసీని అరికట్టే పరిష్కారం ఎవరైనా సూచిస్తారేమో.