జూనియర్ ఎన్టీఆర్‌కి చాలా చిన్న వయసులోనే విపరీతమైన క్రేజ్ వచ్చింది. 'ఆది, సింహాద్రి'లతో ఆయన మెగాభిమానులలో టెన్షన్‌ని, మెగాస్టార్‌ని ఆశ్యర్యపోయేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ప్రభాస్, బన్నీ, రామ్‌చరణ్‌లతో పాటు పవన్‌కళ్యాణ్ కన్నా నాడు ఆయనకు స్టార్ డమ్ వచ్చింది. చిన్నవయసులోనే స్టార్ డమ్ రావడమే కాదు.. నాడు ఆయన్ను ఆయన తండ్రి హరికృష్ణ, అన్నయ్య కళ్యాణ్‌రామ్, తారకరత్న వంటి వారందరూ దూరంగా పెట్టడంతో ఆయనకు సరైన మార్గనిర్దేశకులు లేకుండా పోయారు.
కేవలం వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారితో సహచర్యం చేయడంతో ఆయన ఎంతో పొగరుగా వ్యవహించేవాడు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ దారిలోకి వచ్చాడు. నాడు అభిమానులు వస్తే వారిని పలకరించకుండా, కనీసం ఫొటోలకు కూడా ఫోజులివ్వకుండా, మీడియాను, అందరినీ తరుచుగా కోప్పడుతూ, తన ఇష్టారాజ్యంగా ప్రవర్తించడంతో బుడ్డోడికి భలే పొగరు అనే చర్చ నాడు వచ్చింది. కానీ ఆయన తన తండ్రికి, అన్నయ్యకు చేరువకావడం, లక్ష్మీప్రణతితో వివాహంతో పాటు కొడుకు అభయ్‌రామ్ పుట్టిన తర్వాత ఆయన మరింతగా మారిపోయాడు. ఇప్పుడు చూస్తున్న ఎన్టీఆర్‌ని, నాడు చూసిన ఎన్టీఆర్‌కి బిహేవియర్‌లో ఎంతో తేడా ఉంది.
ఒకానొక సందర్భంగా తన భార్య లక్ష్మీప్రణతి తన జీవితంలోకి రావడం, అభయ్‌రామ్ పుట్టిన తర్వాత తనకు ఎంతో మార్పు వచ్చిందని ఆయనే చెప్పాడు. దీంతో ఇప్పుడు ఆయన హ్యాట్రిక్ విజయాలు సాధించినా కూడా ఆయనలో అహం కనిపించడం లేదు. బన్నీ డ్యాన్స్ అంటే తనకిష్టమని చెప్పాడు. ఇక 'జై లవ కుశ'తో పాటు మహేష్ నటిస్తున్న 'స్పైడర్' కూడా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మహేష్‌కి తనకి అసలు పోటీనే లేదని, బాగుంటే ఎన్ని చిత్రాలైనా ఆడుతాయని చెప్పి మహేష్‌కి కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలిపాడు. ఇలా నాటి 'ఆది' ఎన్టీఆర్‌కి, నేటి 'జై లవకుశ' ఎన్టీఆర్‌కి మద్య ఎంతో పరిణతి కనిపిస్తోందని ముందు నుంచి ఆయనను పరిశీలిస్తున్న వారు విశ్లేషిస్తున్నారు.