Advertisementt

బిగ్ బాస్ లో దీక్ష పై దారుణంగా ప్రవర్తించాడంట!

Thu 21st Sep 2017 12:57 PM
bigg boss show,star maa channel,dhanraj,archana,hari teja,diksha panth  బిగ్ బాస్ లో దీక్ష పై దారుణంగా ప్రవర్తించాడంట!
Diksha Panth Comments on Bigg Boss బిగ్ బాస్ లో దీక్ష పై దారుణంగా ప్రవర్తించాడంట!
Advertisement
Ads by CJ

బుల్లితెరపై సంచలనం బిగ్ బాస్ షో. మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈ షో బాలీవుడ్, కోలీవుడ్ లాగా కాకుండా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ ఎట్టకేలకు ఈ షో చివరి వారానికి చేరుకుంది.ఈ ఆదివారమే గ్రాండ్ ఫైనల్ లో బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ని సెలెక్ట్ చేస్తారు. ఇక బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుండే ఈ షో లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా వారానికి ఒకరిద్దరు ఎలిమినేట్ అవుతూ ఉండి... ఫైనల్ గా ఐదుగురు మాత్రమే ఫైనల్స్ కి వచ్చారు. ఇక ఫైనలకి వచ్చేటప్పటికి వారానికొకరు చొప్పున ఎలిమినేట్ అయినా బిగ్ బాస్ పార్టిసిపేట్స్ ఎవరూ బిగ్ బాస్ మీద ఎలాంటి ఆరోపణలు చెయ్యలేదు. మహేష్ కత్తి, సమీర్, జ్యోతి, సంపూ,కత్తి కార్తీక,సింగర్ మధు ప్రియా, కల్పనా,ముమైత్ ఖాన్,ధనరాజ్ కానివ్వండి ఎవరు బిగ్ బాస్ షో గురించి బ్యాడ్ గా మాట్లాడలేదు.

అయితే గత ఆదివారం ఎలిమినేట్ అయిన దీక్ష పంత్  మాత్రం బిగ్ బాస్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె బిగ్ బాస్ షోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ షోలో జరిగింది చూపెట్టకుండా తాను బాధలో వున్న సీన్స్ మాత్రమే బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో చూపించారని... అలాగే ధనరాజ్ తన విషయం లో చాలా దారుణంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ధనరాజ్ తాను కలిసి బంతి పూల జానకి సినిమాలో నటించినప్పుడు ధనరాజ్ రోజు సాయంత్రం కలుద్దాం అంటూ మిస్ బిహేవ్ చేసేవాడని... కానీ తాను మాత్రం సైలెంట్ గా వుండేదాన్నని చెప్పుకొచ్చింది.

అవన్నీ మనసులో ఉంచుకునే తనని బిగ్ బాస్ హౌస్ లో ధనరాజ్ టార్గెట్ చేశాడని... ఇక అర్చన కూడా తనని ఇబ్బంది పెట్టేదని.... అలాగే హరితేజ కూడా అందరిని మానిప్లెట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ అయినట్లుగా చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో జరిగే మంచిని బయటికి చూపెట్టకుండా చెడుని మాత్రమే బిగ్ బాస్ వారు చూపెట్టేవారని కూడా చెప్పింది. అందుకే ప్రేక్షకులు తన బాధను చూసి ఏలిమినేట్ చేశారని చెబుతుంది. ఇక దీక్ష సంగతి ఏమోగానీ బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ఎవరవుతారో అని బిగ్ బాస్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Diksha Panth Comments on Bigg Boss:

She has been thrown away by Bigg Boss house members. After elimination, Diksha Panth made derogatory comments on the show.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ