చిరంజీవి 151వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి' ఆఫీషియల్ గా మొదలైపోయింది. ఈ చిత్రం ఆఫీషియల్ గా మొదలయినప్పటికి ఇంకా షూటింగ్ మాత్రం స్టార్ట్ చేసుకోలేదు. అయితే పక్కా స్క్రిప్ట్ రెడీగా ఉన్నప్పటికీ కొన్ని పనుల వల్ల ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల, టెక్నీషియన్స్ వివరాలు సినిమా మోషన్ పోస్టర్ లోనే రివీల్ చేశారు. ఈ చిత్రంలో నయనతార, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి హేమాహేమీలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అలాగే చిత్ర బృందం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రహమాన్ పేరు కూడా మోషన్ పోస్టర్ లో వేసింది. ఇక ఆఫీషియల్ గా ఏ ఆర్ రహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. కాకపోతే ఈ మధ్యన మాత్రం ఏ ఆర్ రహమాన్ కున్న పాత కమిట్మెంట్స్ వల్ల సై రా చిత్రానికి మ్యూజిక్ అందించలేనని.. అందుకే ఈ సినిమా నుండి బయటికి వచ్చేసినట్టుగా ప్రచారం జోరుగా జరిగింది. కానీ సాయ్ రా యూనిట్ నుండి అధికారిక సమాచారం అంటూ ఏమిలేదు. మరి సై రా లో ఏ ఆర్ రహమాన్ ఉన్నాడా? లేడా అనేది కన్ఫర్మ్ కావాల్సి ఉంది.
ఇటువంటి తరుణంలోనే ఇప్పుడు ఈ సై రా నుండి మరో టాప్ టెక్నీషియన్ తప్పుకున్నట్టుగా వార్తలొస్తున్నాయి. సై రా ఆఫీషియల్ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ కూడా ఈ సినిమా నుంచి బయటకి వెళ్ళిపోయారు అని టాక్ వినబడుతుంది. అయితే రవి వర్మన్ సై రా యూనిట్ తో ఉన్న పర్సనల్ ఇష్యూస్ వల్లే ఈ సినిమా నుంచి వెళ్ళిపోయారు అంటున్నారు. మరి సినిమా మొదలవ్వకముందే ఇలా ఎవరికీ వారే ఈ సినిమా నుండి బయటికి వచ్చేస్తున్నారు అంటూ కథనాలు రావడంతో సినిమాపై నెగెటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉందని.. అందుకే ఈ విషయమై రామ్ చరణ్ క్లారిటీ ఇస్తే బావుంటుందని మెగా ఫాన్స్ కోరుతున్నారు.