తెలంగాణవారికి దసరా చాలా ముఖ్యమైన పండుగ. వారు బతుకమ్మ పండగగా దీనిని చేసుకుంటారు. ఇక తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిస్తూ తెలంగాణ బాన్సువాడ అమ్మాయికి, ఓ ఎన్నారై అబ్బాయికి జరిగిన ప్రేమకథగా ప్రేక్షకులను 'ఫిదా' చేసింది. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించగా, ఇందులోని ఓ సన్నివేశంలో హీరోయిన్ సాయి పల్లవి బతుకమ్మ కూడా ఆడింది.
ఈ చిత్రం ఈనెల 24 వ తేదీన సాయంత్రం 5గంటలకు స్టార్ మా టీవీలో ప్రసారం కానున్న విషయం తెలిసిందే. తాజాగా జెమిని టీవీ కూడా మరో హిట్ సినిమాతో 'ఫిదా'ని క్రాస్ చేయాలని నిర్ణయించుకుంది. 'ఫిదా'లో నటించిన వరుణ్ తేజ్‌కి పోటీగా ఆయన సోదరుడు రామ్ చరణ్‌ని అడ్దుపెట్టుకుని పోటీకి సై అంటోంది. ఇక సురేందర్‌రెడ్డి దర్వకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా, గీతా ఆర్ట్స్ బేనర్‌లో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ధృవ'. తమిళ 'తనివరువన్'కి రీమేక్‌గా తయారైన ఈ చిత్రం ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌కి, ఓ ఇంటెలిజెంట్ క్రిమినల్‌కి మద్య జరిగే రివేంజ్‌స్టోరీగా తెరకెక్కింది.
ఈ చిత్రం కూడా పెద్దనోట్ల రద్దు సమయంలో వచ్చినా 50కోట్లకు మించి కల్షెన్లు సాధించగా, 'ఫిదా' చిత్రం కూడా 50కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఇక 'ధృవ'లో విలన్‌గా నటించిన అరవింద్‌స్వామికి ఎక్కువ క్రెడిట్ దక్కగా, 'ఫిదా'లోక్రెడిట్ సాయి పల్లవికి దక్కింది.మొత్తానికి టీఆర్పీలతో 'ఫిదా' ద్వారా ఏకపక్షంగా సక్సెస్ ఇవ్వడానికి స్టార్‌మా చానెల్ సిద్దం కాగా, దానికి పోటీగా జెమిని చానెల్ 'ధృవ'ను అడ్డుపెట్టడం అనే నిర్ణయం భేష్షుగా ఉంది.దీంతో ఈనెల 24న ఈ రెండు చిత్రాలు బుల్లితెరపై మొదటిసారి ప్రదర్శితం కానుండటంతో ఏ సినిమాని చూడాలని ప్రేక్షకులు కన్‌ఫ్యూజన్‌కి గురైపోతున్నారు. మరి ఈ రెండు చానెల్స్ మధ్య టీఆర్పీ పోటీలో ఎవరు విజేతలు అవుతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, 'ఫిదా' చిత్రానికే కాస్త ఎక్కువ టీఆర్పీలు వస్తాయనిపిస్తోంది.
'ఫిదా' చిత్రం కొత్త చిత్రం కావడం .. 'ధృవ' విడుదలై చాలాకాలం కావడం దీనికి కారణం కాగా పెద్దనోట్ల రద్దు సమయంలో మనీ కష్టాలు ఎదురై 'ధృవ' చిత్రాన్ని చూడలేకపోయిన ఫ్యామిలి ఆడియన్స్ 'దృవ'ని ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. వచ్చే సంక్రాంతికి పవన్, రామ్ చరణ్ చిత్రాలు వెండితెరపై పోటీపడుతున్నాయని వార్తలు వస్తున్నాయి.ఇక సాధారణంగా మెగా హీరోలు తమ చిత్రాలకు కాస్త గ్యాప్ తీసుకుని విడుదల చేస్తూ ఉంటారు. ఇక ఒకే రోజున ఒకే సమయంకు మెగాహీరోలైన అన్నదమ్ములు వెండితెరపై పోటీ పడకపోయినా బుల్లితెరపై మాత్రం పోటీ పడుతుండటం విశేషం.