Advertisementt

మహేష్‌ బాబుకి కూడా బాగా పెరిగింది..!

Wed 20th Sep 2017 11:33 AM
mahesh babu,twitter followers,dhanush,rajinikanth,tamil fans  మహేష్‌ బాబుకి కూడా బాగా పెరిగింది..!
Mahesh Babu In Twitter 4 Million Followers! మహేష్‌ బాబుకి కూడా బాగా పెరిగింది..!
Advertisement
Ads by CJ

నేడు సమాజంలో సోషల్‌మీడియా ప్రభావం చిన్నా చితకా కాదు. ఒకప్పుడు పోస్టర్‌ యుద్దాలు జరిగితే ఇప్పుడు స్టార్‌ హీరోలకు ట్విట్టర్‌ ఫాలోయర్స్‌ సంఖ్య వారి స్టామినాను తెలియజేసే విషయంగా మారిపోయింది. ఇక ఎప్పటి నుంచో ఉత్తరాదిలో అంటే బాలీవుడ్‌లో తెలుగు అంటే మద్రాసీ సినిమా అని తెలుగు సినిమాలను, తెలుగు స్టార్స్‌ని తమిళులుగానే భావించేవారు. కానీ 'బాహుబలి' తర్వాత దానిలో కూడా విపరీతమైన మార్పులు వచ్చి, తెలుగు సినిమా స్టామినా పెరిగింది. 

కాగా ఇప్పటివరకు దక్షిణాదిలో తమిళస్టార్‌ ధనుష్‌కి మాత్రమే అత్యధికంగా 5.7మిలియన్ల ఫాలోయర్స్‌ ఉన్నారు. ఇక ఆయన మామ, ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రెండోస్థానంలో ఉన్నాడు. ఆయనకు 4.18మిలియన్ల ఫాలోయర్స్‌ ఉన్నారు. ఈ ఇద్దరిలో కాస్త ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండబట్టే ధనుష్‌కి ఎక్కువ ఫాలోయర్స్‌ ఉన్నారు. కానీ ఇటీవల వరకు తెలుగు స్టార్స్‌ ఒక్క తెలుగు సినిమాలకే పరిమితంకావడంతో ధనుష్‌,రజినీకాంత్‌లకు పోటీ ఇవ్వలేక పోతున్నారు. 'స్పైడర్‌' చిత్రం ద్వారా,అందునా మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుండటంతో నేడు తమిళనాడులో కూడా పలువురు సినీ ప్రేమికులు మహేష్‌ ట్విట్టర్‌ని బాగా ఫాలో అవుతున్నారు. 

దాంతో తాజాగా మహేష్‌ ధనుష్‌, రజినీల తర్వాత ట్విట్టర్‌లో ఎక్కువ ఫాలోయర్స్‌ని సంపాదించుకుని తన ఫాలోయర్స్‌ సంఖ్యను 4 మిలియన్స్‌కి చేరుకున్నాడు. ఇదే ఊపులో ఆయన వరుసగా తన చిత్రాలను తమిళంలో కూడా రిలీజ్‌ చేస్తూ వెళ్లితే మార్కెట్‌ రీత్యానే కాదు.. ఫాలోయర్స్‌ రీత్యా కూడా ధనుష్‌, రజినీలకు భారీ పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగులో మరో టాప్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తాజాగా తన ట్విట్టర్‌ ఫాలోయర్స్‌ సంఖ్యను రెండు మిలియన్లు సాధించిన సంగతే. అయితే ధనుష్‌, రజినీ, మహేష్‌ల కంటే పవన్‌ ఫాలోయర్స్‌ విషయం భిన్నమైంది. 

ఎందుకంటే ఆయన తాను ఎప్పుడు తన సినిమాల కోసం, వ్యక్తిగత విషయాల కోసం ట్విట్టర్‌ను ఆశ్రయించడం, కేవలం సామాజిక సమస్యలు,ప్రజా సమస్యల మీదనే ఆయన ట్వీట్‌ చేస్తుంటాడు.అయినా కూడా పవన్‌ రెండు మిలియన్‌ ఫాలోయర్స్‌ని సంపాదించుకున్నాడంటే గ్రేటేనని చెప్పాలి. 

Mahesh Babu In Twitter 4 Million Followers! :

Tamil Star Dhanush Twitter 5.7million followers, Superstar Rajinikanth twitter 4.18 million followers and tollywood superstar Mahesh Babu twitter 4 million followers mahesh babu 3rd place in tamil nadu.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ