Advertisementt

రాశి విషయంలో ఎన్టీఆర్ అంత పని చేశాడా?

Wed 20th Sep 2017 11:28 AM
raashi khanna,jr ntr,jai lava kusa,bobby,telugu dubbing  రాశి విషయంలో ఎన్టీఆర్ అంత పని చేశాడా?
Jr NTR Gives shock to Raashi Khanna! రాశి విషయంలో ఎన్టీఆర్ అంత పని చేశాడా?
Advertisement
Ads by CJ

కొంతమంది హీరోయిన్స్ టాలీవుడ్ లో దశాబ్దాలుగా పాతుకుపోయి సినిమాల మీద సినిమాలు చేస్తున్నా తమ కేరెక్టర్ కి తాము డబ్బింగ్ చెప్పుకోలేరు. దర్శకుడు చెప్పినట్టు మొహంలో హావభావాలను ఎంతో చక్కగా పలికించగల ఈ తరం భామలు గొంతు విషయానికి వచ్చేసరికి డబ్బింగ్ ఆర్టిస్ట్ ల మీద ఆధారపడిపోతున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం తెలుగులోకి అడుపెడుతూనే తెలుగు నేర్చేసుకుని తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పేసుకుంటూ ఆకట్టుకుంటున్నారు. అలా ఈమధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ లు కనబడుతున్నారు. 

ఆ భామలలాగే రాశి ఖన్నా కూడా తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఫిక్స్ అయ్యి తెలుగు నేర్చేసుకుంది. ఇక ఇంతకు ముందే తెలుగు సినిమా 'జోరు' లో గొంతుసవరించిన రాశి ఇప్పుడు పూర్తిగా తెలుగు నేర్చుకుని తన పాత్రలకు తానె డబ్బింగ్ చెప్పుకునే లెవల్ కి ఎదిగింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే రాశి ఖన్నా తాజాగా నటించిన  ‘జై లవ కుశ’లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడిందట. అదే విషయాన్నీ దర్శకుడు బాబీ కి చెప్పడం..... బాబీ తో ఒకే అనిపించుకోవడం చేసిన రాశికి ఎన్టీఆర్ షాక్ ఇచ్చాడట. రాశి ఖన్నా డబ్బింగ్ కి ఎన్టీఆర్ బ్రేక్ వేశాడంటున్నారు.

ఎందుకంటే 'జై లవ కుశ' అనుకున్న టైం కల్లా పూర్తి చేసి విడుదల చెయ్యడానికి చిత్ర బృందం చాలా కష్టపడింది. మరి ఎన్ని కష్టలు వచ్చినా టైం కి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్ర బృందానికి.... ఇపుడు రాశి డబ్బింగ్ వల్ల ఆలస్యమవ్వొచ్చనే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్, రాశి డబ్బింగ్ తో రిస్క్ వద్దని దర్శకుడు బాబీకి చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మాములుగా  అయితే రాశికి తెలుగు భాష కొత్త కాబట్టి ఎమన్నా తేడా వస్తే మళ్లీ ఆమె గొంతుకు సరిపోయే డబ్బింగ్ ఆర్టిస్ట్ ని పట్టుకుని మళ్లీ డబ్బింగ్ చెప్పించాలంటే ఖచ్చితంగా ఆలస్యమవుతుంది అందుకే ఎన్టీఆర్ చిత్ర బృందానికి ఈ సూచన చేశాడన్నమాట. పాపం రాశి ఆశను ఎన్టీఆర్ ఇలా వమ్ము చేశాడన్నమాట.

Jr NTR Gives shock to Raashi Khanna!:

Jr NTR Jai Lava Kusa Movie About heroine Raashi Khanna voice telugu Dubbing NTR, as told by director Bobby at Risk with Raashi Khanna Dubbing.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ