ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ నటిస్తుంది. ప్రభాస్ స్నేహితులు యువీ క్రియేషన్స్ వారు ఈ సాహో చిత్రాన్ని 150 భారీ బడ్జెట్ తో జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న శ్రద్ద కపూర్ పాత్ర ఎలా ఉండబోతుంది అంటూ గత కొంతకాలంగా సోషల్ ఇండియాలో చర్చ నడుస్తుంది. అయితే శ్రద్ద ఈ సాహోలో డ్యూయెల్ రోల్ లో నటించబోతుంది అంటూ ఆ మధ్యన వార్తలొచ్చాయి. అయితే తాను రెండు పాత్రల్లో కనిపించడం లేదని శ్రద్ద కపూర్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇపుడు సాహో లో శ్రద్ధ కపూర్ చెయ్యబోయే రోల్ ఏమిటనేది బయటికి పొక్కినట్లుగా చెబుతున్నారు. ఈ చిత్రంలో శ్రద్ద కపూర్ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని..... ఒక షెడ్ లో ఫైట్స్ అంటూ యాక్షన్ చేసే అమ్మాయిలా రఫ్ అండ్ టఫ్ గా కనబడితే మరో షెడ్ లో సంప్రదాయత ఉట్టిపడే రాయలసీమ అమ్మాయి పాత్రలో కనిపించనుందట. ఇక మోడరన్ షెడ్ ఉన్న అమ్మాయి పాత్ర కోసం శ్రద్ద హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బాట్స్ వద్ద ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. ఇక శ్రద్ద ఈ చిత్రంలో రాయలసీమ యాసలో రెచ్చిపోనుందని అంటున్నారు.
ఇక ఈ మధ్య కాలంలో తెలంగాణ యాసతో తెరకెక్కిన ఫిదా చిత్రంలో సాయి పల్లవి మాట్లాడిన తెలంగాణ యాస, అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ మాట్లాడిన తెలంగాణ యాస చిత్రాలు ఎంత మంచి హిట్స్ అయ్యాయో అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు శ్రద్ద కపూర్ కూడా రాయలసీమ యాసతో ఇరగ్గొట్టి సినిమాని హిట్ చేస్తుందనేది సాహో చిత్ర బృందం ప్లాన్. చూద్దాం శ్రద్ద రాయలసీమ యాస ఈ సినిమాకు ఎంత హెల్ప్ అవుతుందో...!