సామాన్యులు సినిమా వారిని చూస్తే ఏహా ఏమి సుఖం. ఆనందంగా ఉంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు. అనుకుంటూ ఉంటారు. కానీ వారు పాత్రల కోసం బరువు పెరగడం, తగ్గించడం, ఎల్లకాలం ఫిట్‌గా ఉండి అరవైలలో కూడా ఇరవైలలాగా ఉండటానికి కఠోర శ్రమ చేయడమే కాదు.. చివరకు కోరుకున్నవన్నీ కూడా తినలేరు. డైట్‌ని మెయిన్‌టెయిన్ చేస్తారు. తమ ఎనర్జీ లెవల్స్‌ని కాపాడుకుంటూ, బరువును పెరగడం, బరువు తగ్గడం కోసం జిమ్‌లలో పర్యవేక్షకుల ఆధ్వర్యంలో కఠోర శ్రమ చేస్తారు.
దానికి ఉదాహరణ చిరంజీవి, ప్రభాస్‌లే. చిరంజీవి పదేళ్లు గ్యాప్ తీసుకుని రాజకీయాలలో బిజీ అయి పోయి తన గ్లామర్, గ్లోని పోగొట్టుకుని లావుగా, అసహ్యంగా ప్రెస్‌మీట్స్, పార్టీ కార్యక్రమాలలో కనిపించేవాడు. కానీ అనూహ్యంగా ఆయన ఎంతో సన్నబడి, తనలో ఎనర్జీ, గ్రేస్ ఇంకా తగ్గలేదని షష్టిపూర్తి వయసులో నిరూపించుకున్నాడు. ఇక 'సైజ్ జీరో' కోసం అనుష్క, 'బాహుబలి' కోసం ప్రభాస్,రానాలు కండలు పెంచి, యుద్దవిద్యలు నేర్చుకుని ఐదేళ్లు కఠోరతపస్సు చేశారు. విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ అటు 'జై లవ కుశ' షూటింగ్,మరో వైపు 'బిగ్ బాస్'షో హోస్టింగ్‌లతో బిజీగా గడుపుతూ వచ్చాడు. అందునా 'జై లవ కుశ'లో మూడు విభిన్న పాత్రలు కావడంతో ఏ పాత్రకు తగ్గ మేకోవర్ దానికి ఫాలో అవుతూ, ఒకే రోజున మూడు పాత్రలకి కలిపి దాదాపు 40జతల గుడ్డలు మార్చేవాడట.
అందునా రిలీజ్‌లేట్ కాకుండా ఉండటానికి రాత్రింబగళ్లు పనిచేశాడు. దీంతో ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆయన తన ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్‌ప్లాన్ చేస్తున్నాడు. ఎలాగూ త్రివిక్రమ్ పవన్ చిత్రం రిలీజ్ వరకు అంటే సంక్రాంతి వరకు బిజీ. ఆతర్వాతే త్రివిక్రమ్ చిత్రం మొదలుపెడతాడు. కాగా 'జై లవ కుశ' హడావుడి తగ్గగానే ప్రపంచ వ్యాప్ తెచ్చుకుని చీటీలు వేసి తాము ఏ దేశం వెళ్లేది నిర్ణయించుకుంటాడట.