Advertisementt

ఎన్టీఆర్ జనసేన పార్టీ పై ఇలా..!

Tue 19th Sep 2017 02:00 PM
jr ntr,pawan kalyan,janasena party,tdp,chandrababu naidu,balakrishna,jai lava kusa  ఎన్టీఆర్ జనసేన పార్టీ పై ఇలా..!
NTR was Asked about His Expectations on Pawan Kalyan's Jana Sena? ఎన్టీఆర్ జనసేన పార్టీ పై ఇలా..!
Advertisement
Ads by CJ

జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఆయన తాత అంటే ఎంతో అభిమానం. మాటెత్తితే తాత గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆయన 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అడగటంతో టిడిపి తరపున కొన్ని ఏరియాలలో ప్రచారం చేశాడు. ఆ సమయంలోనే ఆయన కారుకి యాక్సిడెంట్‌ కూడా జరిగింది. ఇక ఆతర్వాత జరిగిన పరిణామాలతో చంద్రబాబు ఎన్టీఆర్‌ని పార్టీకి దూరంగా పెట్టాడు. బాలయ్యతో వియ్యం అందుకుని తన కుమారుడు నారా లోకేష్‌కి బాలయ్య కుమార్తె బ్రాహ్మణితో వివాహం చేశాడు. 

దాంతో బాలయ్య తన అల్లుడైన నారా లోకేష్‌ని చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేస్తున్నప్పటికీ, తన అల్లుడు కోసమని బాలయ్య మౌనంగా ఉండి, తన మద్దతును కూడా తెలుపుతున్నాడు. ఇక నారా లోకేష్‌ని ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇచ్చి, తన హెరిటేజ్‌ సంస్థను తన కూతురు బ్రాహ్మణికి ఇవ్వడంతో బాలయ్య ఆనందానికి అవధుల్లేవు. ఇక బాలయ్యని ఎమ్మెల్యేని చేశాడు. బాలయ్యకు వచ్చేసారి కూడా అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వడం తధ్యం. ఇప్పటికే తనకు ముఖ్యమంత్రి పదవిపై మోజు లేదని, కానీ మంత్రిగా చేయాలని ఉందని ఒకానొక సందర్భంగా ఇన్‌డైరెక్ట్‌గా బాలయ్య తన మనోగతాన్ని వెల్లడించాడు. 

ఇక నందమూరి ఎన్టీఆర్‌ కుమారుల్లో కేవలం బాలయ్యకే ఎక్కువ ఫాలోయింగ్‌ ఉంది. దాంతో చంద్రబాబు హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లను వాడి పడేశాడు. తాజాగా కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా తాను తన తాతయ్య స్థాపించిన టిడిపిలోనే ఉంటానని, టిడిపి కోసం ఏమి చేయడానికైనారెడీ అని చెప్పాడు. ఇక విషయానికి వస్తే ఎన్టీఆర్‌ నటించిన 'జై లవ కుశ' రిలీజ్‌ సందర్భంగా ఎన్టీఆర్‌ చేస్తున్న ప్రమోషన్లలో భాగంగా ఎక్కువ మంది నుంచి పవన్‌ జనసేన పార్టీ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఆ పార్టీ పేదలకు ఎలా సాయం చేస్తుందని భావిస్తున్నారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. 

దీంతో మొదట రెండు మూడు సార్లు తప్పించుకున్నా చివరికి తనదైన శైలిలో కర్ర విరక్కుండా, పాము చావకుండా సమాధానం చెప్పాడు. ఆయన మాట్లాడుతూ, నాకు ఏ పార్టీపైనా ఇది అని చెప్పేలా నిశ్చితాభిప్రాయాలు లేవు. అయితే ఓ భారతీయుడిగా ఏ పార్టీ అయినా ప్రజలకు మేలు చేకూర్చేలా ఉండాలని కోరుకుంటాను.. అంటూ ఏ పార్టీ పేరు చెప్పకుండా సమాధానం చెప్పాడు. మరి జూనియరా? మజాకా? 

NTR was Asked about His Expectations on Pawan Kalyan's Jana Sena?:

Jr NTR in an interview of his Jai Lava Kusa, NTR was asked about his expectations on Pawan Kalyan‘s Jana Sena Party.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ