Advertisementt

అబ్బా.. అరిపించేసింది..!

Tue 19th Sep 2017 01:05 PM
tv actress chaitra reddy,rajinikanth,kalaa shooting spot,chaitra reddy kiss to rajinikanth  అబ్బా.. అరిపించేసింది..!
Actress Chaitra Reddy Kiss to Super Star Rajinikanth! అబ్బా.. అరిపించేసింది..!
Advertisement
Ads by CJ

ఎవరైనా తమ అభిమాన నటీనటులను కలవాలనుకుంటారు. వీలైతే షేక్‌హ్యాండ్‌, మరీ వీలైతే ఓ ఫొటోని వారితో దిగాలని కలలు కంటారు. కానీ కొన్నిసార్లు ఈ పిచ్చి అభిమానం, ప్రేమ వంటివి ఎంతకైనా తెగిస్తాయి. గతంలో ఓ వేడుకలో స్టార్‌ షారుఖ్‌ఖాన్‌లో ఓ అభిమాని ఏకంగా లిప్‌లాక్‌ కిస్సే ఇచ్చేసింది. ఇక చిరంజీవి పార్టీ పెట్టి పిఆర్‌పి ప్రచారంలో ఉన్నప్పుడు మరో అభిమాని అందరిలోనూ ముద్దుపెట్టుకుని షాకిచ్చింది. 

తాజాగా ఇదే అనుభవం ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కి ఎదురైంది. ప్రస్తుతం రజినీకాంత్‌ 'కాలా కరికులన్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జీటీవీకి చెందిన సీరియల్స్‌ నటి చైత్రా రెడ్డి ఎప్పటినుంచో రజినీని కలవాలనుకుంటూ ఉండటంతో షూటింగ్‌ స్పాట్‌కి వచ్చింది. వచ్చిన తర్వాత తనను తాను రజినీకి పరిచయం చేసుకుని ఆయనకు తానెంత పెద్ద అభిమానినో వివరించి చెప్పింది. రజినీ కూడా ఆమె చెప్పిందంతా విన్నాడు. చివరకు చైత్రా రెడ్డి తనకు రజినీకాంత్‌తో ఓ ఫొటో దిగాలని అడిగింది. 

దానికి ఓకే అన్న రజినీకాంత్‌ 'కాలా కరికులన్‌' గెటప్‌ అయిన నల్ల జుట్టు, తెల్లని గడ్డంతో ఫొటోకి ఫోజిచ్చాడు. కానీ ఈ వీరాభిమాని మాత్రం ఠక్కున రజినీకాంత్‌ బుగ్గలపై ముద్దుపెట్టేసింది. కాస్త కంగారు పడినా తర్వాత రజినీ తనదైన స్టైల్‌లో నవ్వుతూ ఉన్నాడు. సినిమా షూటింగ్‌లలో ఇలాంటి కిస్‌లు సహజమే కావడంతో ఆయన తన కంగారును బయటపడకుండా మేనేజ్‌ చేశాడు. వాస్తవానికి ఆ అమ్మాయి వయసు రజినీకాంత్‌ కంటే మూడు నాలుగురెట్టు పెద్ద. 

ఇంకా చెప్పాలంటే ఆమెది రజినీ మనవరాలి వయసు. కాగా ఈ ముద్దిస్తున్నప్పటి ఫొటోలు సహజమే గానీ, ఈ ముద్దు పెట్టేటప్పుడు ఆ చైత్రారెడ్డి ఎంత తన్మయత్వంతో ముద్దు పెట్టిందో ఆ ఫోటోని చూస్తే మనకు అర్ధమవుతుంది. అబ్బా.. ఎంత తన్మయత్వంలా ఈ అమ్మడికి అని ఈ ఫోటోను చూసిన వారు అంటున్నారు. 

Actress Chaitra Reddy Kiss to Super Star Rajinikanth!:

A female fan Chaitra Reddy who is around three times lesser than his age kissed him tightly.Rajini is busy shooting for his upcoming movie Karikulan.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ