అమితాబ్ బచ్చనే కాదు.. హాలీవుడ్ హీరోలను ఎవరినైనా చూసుకోండి వారు మంచి హైట్‌గా, కండలు తీరిగిన శరీరంతో కనిపిస్తారు. ఇక తెలుగులో అలా ఆజానుబాహుడిగా, మంచి ఎత్తు ఉండి, కండలు పెంచి, సిక్స్ ప్యాక్‌లు, ఎయిట్ ప్యాక్‌లు సాధించిన వారు ప్రభాస్, రానా, సిక్స్ ప్యాకైనా, ఎయిట్ ప్యాకైనా ఏ హీరో అయినా చేస్తాడు. కానీ ఈ సిక్స్ ప్యాక్ అనేది జూనియర్ ఎన్టీఆర్,నారా రోహిత్, సునీల్‌ల కంటే పొడవైన వారికే కలిసోస్తుంది.
ఇక హైట్ ఎక్కువగా ఉండటం వల్ల మైనస్ పాయింట్ ఒక్కటే ఉంటుంది. వారు డ్యాన్స్ చేసినా, వైవిధ్యమైన స్టెప్పులేసినా అందగించదు, ఎవరో హృతిక్ రోషన్ వంటి వారు అరుదుగా బాగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. కాస్త హైట్ తక్కువగా, లేదా మీడియం రేంజ్‌లో ఉండే జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, రామ్ వంటి వారికే డ్యాన్స్‌లు నప్పుతాయి. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ విషయానికి వస్తే ఆయనకున్న ఏకైక ప్లస్ పాయింట్ ఆయన ఎత్తే. తన కెరీర్ ప్రారంభం నుంచి ఆయన విభిన్న చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో 'కంచె' చిత్రంలో జవాన్ పాత్ర కావడంతో ఆయనకు బాగా నప్పింది.
ఇక 'ఫిదా' చిత్రం ద్వారా ఆయన ఏకంగా 50కోట్ల క్లబ్‌లోకి చేరాడు. కానీ ఈచిత్రం క్రెడిట్ అంతా సాయి పల్లవి, శేఖర్‌కమ్ముల, దిల్‌రాజుల ఖాతాలో పడింది. అయినా ఈ చిత్రంలో ఆయన లవర్‌బోయ్‌గా బాగా చేశాడనే ప్రశంసలు దక్కాయి. కాగా ప్రస్తుతం ఈ మెగా హీరో వరుణ్ తేజ్ కూడా జిమ్‌లో సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ కోసమేమో గానీ తెగ కష్టపడుతున్నాడు. నిజానికి ఆయన తన హైట్‌కి ఇలా కండలు తిరిగి, తన డైలాగ్ డెలివరీని కూడా గంభీరంగా మార్చుకుంటే సాయి ధరమ్ తేజ్ కన్నా వరుణ్ తేజే మాస్ అండ్ కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడు.
తాజాగా ఆయన జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న ఫొటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, లక్ష్యం చేరుకోవడం కోసం బాగా కష్టపడుతున్నానని, ఇప్పటికి కేవలం సగం గోల్‌నే రీచ్ అయినట్లు తెలిపాడు. మరి ఆయన నటిస్తున్న వెంకీ అట్టూరి చిత్రం కోసమే ఆయన ఈ బాడీ బిల్టింగ్‌లు చేస్తున్నాడా? అనిపిస్తోంది. గతంలో మాస్ బాట పట్టి 'లోఫర్'తో దెబ్బతిన్న వరుణ్ తేజ్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్‌ని చేస్తున్నాడంటే ఇది ఓ యాక్షన్ చిత్రం అని అర్ధమవుతోంది.
మాస్ చిత్రం చేసినా మరో 'లోఫర్' కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందని గుర్తించాలి. మొత్తానికి హైట్, బాడీ బిల్డింగ్‌లో వరుణ్ తేజ్ ప్రభాస్, రానాలను డీకొట్ట గల సత్తా ఉందనిపిస్తోంది. అయితే ఆయన నటనలో కూడా ఇంకా ఇంప్రూవ్ కావాల్సివుందని విశ్లేషకులు అంటున్నారు.