దాదాపు ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రాన్ని, స్టార్ మాలో ప్రసారమవుతున్న 'బిగ్ బాస్'షోని ఒకేసారి ప్రారంభించి దాదాపు ఒకేసారి ఫినిష్ చేయనున్నాడు. ఇక ఎన్టీఆర్ అంటే వ్యంగ్యోక్తులకు, సెటైర్లకు పెట్టింది పేరు. ఆయన తనకు నచ్చని సినిమా జనాలనైనా, మీడియానైనా వ్యంగ్యోక్తుల ద్వారానే సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా ఆయన తనకు లభించిన హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్నాడు. దాంతో ఆయన తాజా చిత్రం 'జై లవ కుశ'పై ఎంతో నమ్మకంగా ఉన్నాడు.
ప్రమోషన్లతో అదరగొడుతున్నాడు. ఇక ఆయన నిర్వహిస్తున్న 'బిగ్ బాస్'షోకి పలు చిత్రాల ప్రమోషన్స్ కోసం రానా నుంచి సునీల్ వరకు వచ్చారు. మరి మీ 'జై లవ కుశ' ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ హౌస్‌కి మీ చిత్రంలోని మూడు పాత్రలు ప్రమోషన్‌కి వస్తే ఎలా ఉంటుంది? అనే ఓ హాస్య ప్రశ్న ఎదురైంది. మరి అసలే స్పాంటేనియస్‌గా స్పందించడంలో, వాక్చాతుర్యంలో దిట్ట అయిన ఎన్టీఆర్ దీనికి ఎంతో తమాషాగా సమాధానం ఇచ్చాడు.
'కుశ' వస్తే ఆయన తుంటరి కాబట్టి గోడ దూకి పారిపోతాడు. 'లవ' వస్తే మంచోడు కాబట్టి ఏం చెప్పినా చేస్తాడు.స్విమ్మింగ్‌ఫూల్‌లో ఉండమని చెప్పినా అలాగే ఉండిపోతాడు. ఇక 'జై' వస్తే మాత్రం రచ్చరచ్చ చేస్తాడు. వాడితో చాలా కష్టం. అల్లకల్లోలం చేసేస్తాడు. బిగ్ బాస్ హౌస్‌నే తగుల బెడతాడు అని సమాధానం ఇచ్చాడు. ఇక ఈ మూడు పాత్రల్లోని లక్షణాలు అన్నీ కొంతకొంత తనలో కూడా ఉన్నాయన్నాడు. ఇక 'జై' పాత్రకు చెప్పిన 'మనం అనేది అబద్దం.. నేను మాత్రమే నిజం' అని నత్తితో డైలాగ్ చెప్పి, 'లవ పాత్రకు ఇది పుస్తకంలో అయితే పాఠం అవుతుంది. జీవితంలో అయితే గుణపాఠం అవుతుంది...', 'కుశ పాత్రకు నాకు కొట్టేయడమూ తెలుసు... కొట్టడం తెలుసు' అని చెప్పి అదరహో అనిపించాడు.