తెలుగు పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తరవాత బెస్ట్ డాన్సర్స్ గా ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఉన్నారు. అయితే అందరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ డాన్స్ లకు మాత్రం ఎక్కువ మంది అభిమానులే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఎన్టీఆర్ డాన్స్ లను ఆయన సినిమాల్లో ఎన్టీఆర్ అభిమానులు ఆసాంతం ఆస్వాదించలేకపోతున్నారన్నది మాత్రం వాస్తవం. ఎన్టీఆర్ తో పని చేసిన డైరెక్టర్స్ అంతా ఎన్టీఆర్ చేసే డాన్స్ లను వాడుకోలేకపోయారు. కేవలం హీరోయిన్స్ తో డ్యూయెట్స్ చేసే టప్పుడు కూడా ఎన్టీఆర్ లోని డాన్స్ యాంగిల్ ని ఫుల్ గా వాడుకోలేయకపోయారు. ఫలితం ఎన్టీఆర్ సినిమాల్లో ఆశించినత డాన్స్ చూడలేకపోయారు అభిమానులు,
అయితే ఇప్పుడు జై లవ కుశలో మాత్రం ఎన్టీఆర్ డాన్స్ భీభత్సంగా ఉండబోతుందట. జై లవ కుశ లో జై పాత్రధారి రావణుడి గెటప్ లో ఇరగదీస్తున్న విషయం తెల్సిందే. మరి రావణుడు పురాణాల్లో నాట్యం చెయ్యలేదుగాని... ఈ కలియుగ రావణుడు జై మాత్రం డాన్స్ ల్లో ఇరగదీసేస్తాడట. అందుకే ఈ జై లవ కుశ లో రావణతాండవం ఏమిటో అభిమానులకు చూపించబోతున్నాడట. మరి అతి కర్కశుడు రావణుడు తాండవం చేస్తుంటే ఎలా ఉంటుందో తెలియదు గాని జై మాత్రం జై లవ కుశలో రావణతాండవం చెయ్యడం గ్యారెంటీ అంటున్నారు.
ఇప్పటికే తమన్నా ఐటెం సాంగ్ స్వింగ్ జరా లో తమన్నాతో స్టెప్పులు కలిపిన ఎన్టీఆర్ డాన్స్ స్టెప్పులు కేవలం ప్రోమో మాత్రమే చూసాం గాని పూర్తి డాన్స్ చూడడానికి మాత్రం రెండు కళ్ళు చాలవంటున్నారు. ఇక ఎన్టీఆర్, తమన్నాతో కలిసి ఐటెం లో ఇరగదీసే డాన్స్ చెయ్యబోతున్నాడన్నమాట. మరి ఇప్పటివరకు స్వింగ్ జరా లో తమన్నా డాన్స్ కి మిక్సడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ వేసే స్టెప్స్ తో మాత్రం ఆ స్వింగ్ జరా ఐటెం సాంగ్ వన్ అఫ్ ది బెస్ట్ ఐటెంగా ఉండిపోతుంది అంటున్నారు. చూద్దాం జై లవ కుశ సినిమాలో దర్శకుడు బాబీ, ఎన్టీఆర్ తో ఎలాంటి స్టెప్స్ వేయించాడో.