Advertisementt

స్పైడర్ కి సర్టిఫికెట్ వచ్చేసింది..!

Mon 18th Sep 2017 07:11 PM
spyder,spyder censor certificate,director ar murugadoss,mahesh babu,spyder u/a certificate  స్పైడర్ కి సర్టిఫికెట్ వచ్చేసింది..!
Spyder Movie Censor Report! స్పైడర్ కి సర్టిఫికెట్ వచ్చేసింది..!
Advertisement
Ads by CJ

మరో పది రోజులల్లో స్పైడర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మురుగదాస్ - మహేష్ బాబు కలయికలో వస్తున్న స్పైడర్ సినిమా పై  భీభత్సమైన అంచనాలున్నాయి. అసలు వీరి కలయికలో సినిమా అనగానే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా అంతా హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయనేది మాత్రం స్పైడర్ టీజర్స్ లోను, ట్రైలర్ లోను చూపించారు. ఈ సినిమాలో సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ హైలెట్ అంటున్నారు. ఈ సంతోష్ శివన్ మొదటిసారి తెలుగులో పనిచేశాడు.

ఈయన తెలుగులో పనిచేసిన తోలి తెలుగు సినిమా స్పైడర్. మరి మామూలుగానే మహేష్ బాబు చాలా అందగాడు... అయినా స్పైడర్ సినిమాలో మహేష్ ని మరింత అందంగా చూపెట్టాడనే విషయం స్పైడర్ పాటలు, ట్రైలర్ లో పూర్తిగా అర్ధమైంది. అలాగే మురుగదాస్ మార్క్ స్పైడర్ ట్రైలర్ లో అణువణువునా కనబడుతుంది. స్పైడర్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయనే విషయం కూడా అర్ధమవుతుంది. ఒక దర్శకుడు, నటుడు అయిన ఎస్ జె సూర్య విలన్ గా నటించడం, అలాగే మరో తమిళ హీరో భారత్ కూడా స్పైడర్ లో మహేష్ కోసం విలన్ అవతారమెత్తడం వంటి వాటితో స్పైడర్ పూర్తిగా ప్రత్యేకతని సంతరించుకుంది.

అలాగే స్పైడర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మాములుగా రాలేదు. 150  కోట్ల పై మేర జరిగిన స్పైడర్ సినిమా విజయంపై చిత్ర బృందం ధీమాగా వున్నారు. ఇక స్పైడర్ సినిమా పబ్లిసిటీ కూడా పీక్స్ లో ఉంది. ఇక ఈరోజే స్పైడర్ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది. ఇక సెన్సార్ నుండి U/A సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేసింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా దసరా సీజన్ క్యాష్ చేసుకుని సూపర్ విజయం సాధించాలనే ప్రయత్నాల్లో ఉంది. ఈ స్పైడర్ ట్రైలర్ ని వీక్షించిన దగ్గరనుండి మహేష్ బాబు స్పైడర్ క్లాస్ ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టడానికి వచ్చేస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. చూద్దాం స్పైడర్ కేవలం క్లాస్ ప్రేక్షకులదా? లేకుంటే మాస్ ని కూడా అలరించగలదా అనేది త్వరలోనే తెలుస్తుంది.

Spyder Movie Censor Report!:

Super Star Mahesh Babu-AR Murugadoss Spyder has completed the censor formalities today. The censor board has issued U/A certificate with no cuts.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ