Advertisementt

బాబాయ్ డైలాగ్.. అబ్బాయ్ నోటివెంట!

Mon 18th Sep 2017 06:56 PM
jr ntr,balakrishna,jai lava kusa,jr ntr ninterview  బాబాయ్ డైలాగ్.. అబ్బాయ్ నోటివెంట!
Jr NTR Says Balakrishna Dialogue! బాబాయ్ డైలాగ్.. అబ్బాయ్ నోటివెంట!
Advertisement
Ads by CJ

నందమూరి ఫ్యామిలిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. కానీ ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోదనేది జగమెరిగిన సత్యం, హరికృష్ణ, కళ్యాణ్ రామ్, తారక్ లు మాత్రమే ఒక ఫ్యామిలీగా వుంటారు. మిగతా నందమూరి ఫ్యామిలీ అంతా ఒక ఎత్తు. కళ్యాణ్ రామ్ మాత్రం బాలకృష్ణ వాళ్లతో బాగానే సఖ్యతతో ఉంటాడు. బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎలా ఉంటాడో కూడా అందరికి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ మాత్రం ఎప్పటికపుడు నందమూరి ఫ్యామిలీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ తాజా చిత్రం' జై లవ కుశ' విడుదలకు సిద్ధంగా వుంది. జై లవ కుశ విడుదల సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు గట్రా ఇస్తూ హంగామా చేస్తున్నాడు.

అయితే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాబాయ్ బాలకృష్ణ సినిమాల్లోని తనకు ఇష్టమైన డైలాగు ఒకటి ఎన్టీఆర్ నోటివెంట వచ్చింది. సదరు ఛానల్ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన  బాబాయ్ సినిమాల్లోని తనకు బాగా ఇష్టమైన డైలాగ్‌ ఏంటో ఎన్టీఆర్ చెప్పాడు. బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాలోని 'ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. టైమ్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే.. ఒక్కడినే వస్తా.. చెమట పట్టకుండా చంపేస్తా....' అంటూ వీరలెవల్లో  ఎన్టీఆర్ ఎంతో ఎనర్జీతో నవ్వుతూ చెప్పాడు.

అయితే ఆ డైలాగ్ చివరిలో ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా..’ అని ఉండాలి కానీ ఎన్టీఆర్ మాత్రం తన స్టయిల్ లో ‘ఒక్కడినే వస్తా.. చెమట పట్టకుండా చంపేస్తా!’ అంటూ చెప్పి అందరిని ఆకర్షించాడు.

Jr NTR Says Balakrishna Dialogue!:

Jr NTR interview about Jai Lava Kusa Movie in a channel. Jr NTR says Balakrishna Dialogue in Narasimha naidu movie.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ