Advertisementt

ఈ కమెడియన్‌కి ఇప్పుడు అర్ధమైంది..!

Mon 18th Sep 2017 03:55 PM
sunil,chiranjeevi 151 movie,sye raa narasimha reddy,ram charan,surender reddy director  ఈ కమెడియన్‌కి ఇప్పుడు అర్ధమైంది..!
Sunil in Sye Raa Narasimhareddy ఈ కమెడియన్‌కి ఇప్పుడు అర్ధమైంది..!
Advertisement
Ads by CJ

కమెడియన్‌గా, మరీ ముఖ్యంగా హీరోల స్నేహితుడిగా నటిస్తూ కెరీర్‌ ఊపులో ఉన్న దశలో కమెడియన్‌ సునీల్‌ హీరోగా మారాడు. 'అందాల రాముడు'తో హీరోగా మెప్పించాడు. ఆ తర్వాత ఐదేళ్లు కమెడియన్‌గానే పాత్రలు చేసి, ఇటు హీరోగా, అటు కమెడియన్‌గా కూడా అలరించాడు. కానీ ఆ సమయాన్ని ఆయన బుద్ది పనిచేయకపోనందు వల్లనో, ఏలిననాటి శని పట్టడం వల్లనో ఆయన కేవలం 'మర్యాదరామన్న' నుంచి కేవలం హీరోగానే చేస్తున్నాడు. 

'తడాఖా' చిత్రంలో నాగ చైతన్య సోదరుడిగా చేశాడు. ఇలా మొదట్లో కామెడీ పాత్రలు, ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, ఆ తర్వాత హీరోగా నటించిన సునీల్‌కి ఓ కోరిక ఉందట. తానకు విలన్‌ పాత్రలు చేయాలని ఉందని, కానీ తనకు విలన్‌గా ఏ దర్శకనిర్మాతలు, హీరోలు చాన్స్‌లు ఇవ్వడం లేదంటున్నాడు. విలన్‌ పాత్రలు కూడా చేస్తే కమెడియన్‌గా,క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హీరోగా చేసిన సునీల్‌ని ఆల్‌రౌండర్‌ అనవచ్చు. అయినా ఆయనకు విలన్‌ పాత్రలు నప్పుతాయా? అన్నదే ప్రశ్న.

ఇక తాను ఇకనుంచి హీరోగా చేస్తూనే కామెడీ పాత్రలు కూడా చేస్తానని, హాస్యనటుడిగా ఉంటూనే కామెడీ కింగ్‌గా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాదే తనకు స్ఫూర్తి అని అంటున్నాడు. ఇక ఎన్‌కౌంటర్‌ శంకర్‌తో మలయాళ రీమేక్‌గా చేస్తున్న 'టూ కంట్రీస్‌' చిత్రం షూటింగ్‌ కూడా పూర్తయిందని, ఇక తాను మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రంలో నటించలేకపోయానని,కానీ ఆయన 151వ చిత్రంగా రూపొందుతున్న 'సై..రా.. నరసింహారెడ్డి' చిత్రంలో ఓ పాత్రను చేస్తున్నానని తెలిపాడు.ఇక త్వరలో గోపీగణేష్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో హీరోగా నటిస్తునట్లు కన్‌ఫర్మ్‌ చేశాడు. 

Sunil in Sye Raa Narasimhareddy:

And now, yet another hero of Tollywood will be donning a key role in the film and he is none other than hero Sunil.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ