నేటి ట్రెండ్‌లో యంగ్‌హీరోలు ఎలాంటి ఇగోలు లేకుండా తెర వెనుక కూడా ఎంతో మంచిస్నేహితులుగా ఉంటున్నారు. ఒకరిని మరొకరు పొగుడుతూ మిగిలిన హీరోలలో ఉత్సాహం నింపుతున్నారు. స్టోరీ బాగుంటే ఒకరి చిత్రాలలో మరొకరు కూడా కలసి నటిస్తూ, ఇగోలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల వచ్చిన 'శమంతకమణి' చిత్రంలో ఏకంగా నలుగురు యంగ్ హీరోలు కలిసి నటించారు. దీనిని మల్టీస్టారర్ అనలేం గానీ మల్టీహీరోల చిత్రంగా మాత్రం చెప్పవచ్చు.
ఇక నారా రోహిత్, నాగశౌర్యలు మంచి స్నేహితులు. దాంతో నారా రోహిత్ అడిగిన వెంటనే నాగశౌర్య తాజాగా 'కథలో రాజకుమారి' చిత్రంలో ప్రత్యేక పాత్రను చేశాడు. కానీ ఈచిత్రం డిజాస్టర్‌టాక్ తెచ్చుకుంది. నాగశౌర్య నటించిన పాత్ర కీలకమైనదే అయినా దర్శకలోపంతో పేలవంగా సాగింది. ఇక నాగశౌర్యకి మంచి లవర్‌బోయ్ ఇమేజ్ ఉంది.ఆయన తనకు తగ్గ ప్రేమ కథా చిత్రాలలో నటిస్తూ చూసేందుకు ఓ వర్గం ఆడియన్స్ రెడీగా ఉన్నారు.
కానీ ఆయన తన బలమైన ప్రేమకధా చిత్రాలు, లవర్‌బోయ్ ఇమేజ్‌ని నిర్లక్ష్యం చేస్తూ ఏవేవో పాత్రలను చేస్తుండటంతో ఆయన కెరీర్ అటు ఇటు కాకుండా పోతోంది. 'కథలో రాజకుమారి' చిత్రమే కాకుండా ఆయన కథలపై దృష్టిపెట్టక పోతుండటంతో వరుస అపజయాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ హీరో ఆశలన్నీ 'ఫిదా' భానుమతిగా సంచలనం సృష్టించిన సాయి పల్లవితో చేస్తున్న చిత్రం మీదనే ఉన్నాయి. కాస్త అనుభవమే ఉన్న విజయ్ దేవరకొండనే ఎంతో జాగ్రత్తగా 'పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి' వంటి భిన్నమైన కథలను, వైవిధ్యభరిత చిత్రాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.
నాని, శర్వానంద్, రాజ్‌తరుణ్ వంటి వారు వైవిద్యభరిత చిత్రాలను ఎంచుకుంటూ ఉంటే... మంచి అనుభవమే. పరిస్థితులపై అవగాహన ఉన్న నాగశౌర్య వంటి వారు మాత్రం కథ, దర్శకుల విషయంలో తప్పటడుగులు వేస్తూంటే రాబోయే కాలంలో తరుణ్, నవదీప్, ఉదయ్‌కిరణ్, వినీత్, అబ్బాస్... ఇలా వీరి సరసన చేరిపోవడం ఖాయమనే చెప్పవచ్చు.