నిర్మాత దిల్‌రాజుకి ఇండస్ట్రీలో మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా, సినిమాలను కరెక్ట్‌గా జడ్జ్ చేయగలిగిన వ్యక్తిగా ఎంతో పేరుంది. ఇక ఆయన తీసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, ప్రేమకథా చిత్రాలు ఆయనకు ఎంతో పేరును, డబ్బును తెచ్చిపెట్టాయి. ఇక ఆయన ఇప్పటికే నిర్మాతగా ఈ ఏడాది ఇప్పటి వరకు 'శతమానం భవతి, నేను.. లోకల్, ఫిదా' చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నాడు. ఇక 'డిజె' మాత్రం ఫర్వాలేదనిపించింది.
ఇక ఈ హీరో తాను సినిమా తీయాలంటే ఎక్కువగా మెగాఫ్యామిలీకి చెందిన యంగ్ స్టార్స్‌తో ఎక్కువ చిత్రాలు చేస్తూ ఉంటాడు. కానీ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే ఆయన రూటే సపరేట్. డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన ప్రస్తుతం పవన్-త్రివిక్రమ్ చిత్రం, మహేష్ బాబు 'స్పైడర్'ల డిస్ట్రిబ్యూషన్ హక్కులు పొందాడు. ఇక మహేష్ తదుపరి చిత్రమైన కొరటాల శివ-దానయ్యల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'భరత్ అనేనేను' చిత్రం రైట్స్‌ని కూడా సొంతం చేసుకున్నాడు.
ఇక ఆ తర్వాత ఆయన ఏకంగా అశ్వనీదత్ భాగస్వామ్యంలో వంశీపైడిపల్లి చిత్రాన్ని కూడా నైజాంలో ఆయనే రిలీజ్ చేయనున్నాడు. మరోవైపు ఆయన నానితో 'ఎంసీఏ', రవితేజతో 'రాజా దిగ్రేట్' చిత్రాలను నిర్మిస్తున్నాడు. మొత్తానికి దిల్‌రాజు తను స్వంతగా సినిమా తీయాలంటే చిన్న, మీడియం రేంజ్ చిత్రాలను, అలాగే లోబడ్జెట్, మీడియం బడ్జెట్ చిత్రాలనే నిర్మిస్తున్నాడు. ఎప్పుడో అప్పుడప్పుడు మాత్రమే స్టార్స్‌తో హైబడ్జెట్ చిత్రాలను చేసినా అవి పెద్దగా వర్కౌట్ కావడం లేదు. దాంతో నిర్మాతగా మీడియం హీరోలతో మరీ ముఖ్యంగా మెగాఫ్యామిలీకి చెందిన వారితో ఎక్కువ చిత్రాలు తీస్తూనే, మరో పక్క డిస్ట్రిబ్యూటర్‌గా మాత్రం పెద్ద పెద్ద స్టార్స్ చిత్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ 'జై లవ కుశ'ని కూడా ఈయనే వైజాగ్‌లో పంపిణీ చేస్తున్నాడు. ఇలా ఆయన సవ్యసాచిగా పేరు తెచ్చుకుంటూ నిఖార్సైన బిజినెస్‌మేన్‌గా నిలుస్తున్నాడు. మూడునాలుగు శాతం చిత్రాలే హిట్ అవుతున్న తరుణంలో ఆయన ఏకంగా 90 శాతం హిట్‌రేంజ్‌తో ముందుకు దూసుకు వెళ్తున్నాడు.