Advertisementt

బిగ్ బాస్ హౌస్ లో అది చేస్తున్నారా..?

Sun 17th Sep 2017 05:44 PM
jr ntr,bigg boss telugu show,jai lava kusa movie team,ntr to cook mutton biryani  బిగ్ బాస్ హౌస్ లో అది చేస్తున్నారా..?
Jr NTR To Cook Mutton Biryani in Bigg Boss బిగ్ బాస్ హౌస్ లో అది చేస్తున్నారా..?
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు 'జై లవ కుశ' ప్రమోషన్స్ తోనూ, బిగ్ బాస్ సీజన్ వన్ లాస్ట్ ఎపిసోడ్ కి హోస్ట్ గాను ఫుల్ బిజీగా వున్నాడు. జై లవ కుశ సినిమా విడుదలకు దగ్గరపడడంతో సినిమా ప్రమోషన్స్ ని వీర లెవల్లో చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకి జై లవ కుశ నిర్మాత కళ్యాణ్ రామ్, హీరోయిన్స్ రాశి ఖన్నా, నివేదలతో పాటే జై లవ కుశ హీరో, బిగ్ బాస్ హోస్ట్ ఎన్టీఆర్ బిగ్ హౌస్ లోకి ఎంటర్ అవడమే కాదు పిచ్చ పిచ్చగా సందడి చేసి ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు. 

ఈ శనివారం వీరందరి సందడితో బిగ్ బాస్ హౌస్ లో కళ వచ్చిందనడంలో సందేహం లేదు. ఇక ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి బిగ్ హౌస్ లోకి సడన్ గా వచ్చి కంటెస్టెంట్స్ ని సర్ప్రైజ్ చెయ్యడమే కాదు. అక్కడే తన అల్లరి పెరఫార్మెన్సు తో అందరిని ఎంటర్టైన్ చేశాడు. ఇక హీరోయిన్స్ తో కలిసి భీభత్సంగా జై లవ కుశ ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లాడు. ఇక శనివారం ఎపిసోడ్ లో వీరి సందడి మాత్రం ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి హీరోయిన్స్ రాశి, నివేత, నిర్మాత కళ్యాణ్ లు బయటికి వచ్చెయ్యగా ఎన్టీఆర్ మాత్రం హౌస్ కంటెస్టెంట్స్ తోపాటు హౌస్ లోనే వుండిపోయాడు.

ఇక ఈ రోజు ఆదివారం ప్రసారం కానున్న బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ వంట చెయ్యబోతున్నాడు. మరి కళ్యాణ్ రామ్ నిన్న బిగ్ హౌస్ లో తారక్ వంట బాగా చేస్తాడని.. అందులోను బిర్యానీ అదరగొడతాడనే విషయం చెప్పేశాడు. మరి ఈ రోజు బిగ్ బాస్ లో ఎన్టీఆర్ చెయ్యబోయే మటన్ బిర్యానీ ని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆస్వాదిస్తారన్నమాట. ఎన్టీఆర్ బిగ్ హౌస్ లో చెయ్యబోయే వంటతో పాటే ఆయన చేసే అల్లరి, ఎనర్జీ పెరఫార్మెన్సు చూడడానికి రెండు తెలుగు ప్రేక్షకులు సిద్దమైపొండి.

Jr NTR To Cook Mutton Biryani in Bigg Boss:

Jr NTR hosted to Bigg Boss Telugu show in this bigg boss house NTR to Preparing Mutton biryani this sunday.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ