ఆగష్టు 25 న విడుదలైన అర్జున్ రెడ్డి అనూహ్య విజయం తర్వాత మళ్లీ ఇప్పటివరకు అంటే గత నాలుగు వారాలుగా బాక్సాఫీసును షేక్ చేసే సినిమా ఒక్కటి రాలేదు. సెప్టెంబర్ 1 న పైసా వసూల్ పైసల్ వసూలు చెయ్యలేక చేతులెత్తేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 8 న యుద్ధం శరణం, యుద్ధం చెయ్యలేక పారిపోయింది, ఇక మేడ మీద బ్బాయి, ఆ అబ్బాయి మేడ దిగలేక మేడ మీదే ఉండిపోయ్యాడు ఈ రెండూ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. ఇక ఆ తర్వాతి వరం అంటే ఈ శుక్రవారం సెప్టెంబర్ 15 న ఏకంగా 5 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సినిమాలైతే వరుసగా క్యూ కట్టాయి కానీ..... ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనేది పచ్చి నిజం.
నారా రోహిత్ కథలో రాజకుమారి అంటూ సైలెంట్ గా బాక్సాఫీసు వద్ద యుద్దానికి దిగిపోయాడు. ఇక సినిమా టైటిల్ తో బాగానే ఎట్రాక్ట్ చేసింది కథలో రాజకుమారి. అలాగే ఈ సినిమాలో నాగ సౌర్య వంటి హీరో క్యామియోరోల్ చేసిన ఫలితం మాత్రం ప్లాప్. అలాగే సునీల్ నటించిన ఉంగరాల రాంబాబు సినిమా మొదటి రోజు మొదటి ఆటకే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సోమవారం నుంచి ఈ సినిమా ఆడేది డౌటే అంటున్నారు. ఇక బాహుబలి రైటర్ దర్శకత్వంలో వచ్చిన శ్రీవల్లీ మూవీ కూడా డిజాస్టర్ అయింది. అసలు ఈ సినిమా ఏ యాంగిల్ లో ఆకట్టుకోలేదు. ఇక శ్రీ వల్లికి కి పెద్ద పెద్ద స్టార్స్ అంతా ఫుల్ గా సపోర్ట్ కూడా చేశారు.
రామ్ చరణ్, రాజమౌళి, వెంకటేశ్, ప్రభాస్ లాంటి బడా స్టార్స్ ప్రమోట్ చేసినప్పటికీ.. శ్రీవల్లి సినిమాలో విషయం లేకపోవడంతో అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక సచిన్ జోషి హీరోగా తెరకెక్కిన వీడెవడు కూడా దాదాపు ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక తమిళ్ నుండి డబ్బింగ్ అయిన సరసుడు కూడా సోది లోకి లేకుండా పోయింది. శింబు-నయనతార కాంబోలో వచ్చిన సరసుడు సినిమాను భరించడం ప్రేక్షకుల వల్ల కాలేదు. అలా ఈ శుక్రవారం విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోగా... ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే చివరికి ఈవారం కూడా అర్జున్ రెడ్డి కి కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటున్నారు.