యాంకర్లందు అనసూయ వేరయా అని చెప్పాలి. రేష్మి, శ్రీముఖి వంటి వారైతే ఇంకా పెళ్లి కాని వారు. కానీ ఇద్దరు పిల్లలకు అమ్మ అయిన అనసూయ ఏమాత్రం ఎక్స్‌పోజింగ్ చేసినా, కాస్త శృంగారం చేసినా, దుస్తుల్లో కాస్త తేడా ఉన్నా కూడా మన యువత ఆమంటే పిచ్చెక్కిపోతున్నారు. దాంతో ఆమె పాపులారిటీ చూసి సినీ దర్శకులు, నిర్మాతలు, చివరకు హీరోలు కూడా ఆమెపై దృష్టి పెడుతున్నారు. కాగా ఈ అమ్మడు కేవలం ఐటం సాంగ్స్ అయితే మాత్రం చేయనని, కానీ తనకు యాక్టింగ్ సీన్స్‌లో కూడా ప్రాధాన్యం ఇస్తేనే ఐటంసాంగ్స్ చేస్తాననే కండీషన్ పెట్టి 'అత్తారింటికిదారేది' చిత్రంలో అవకాశాన్నే వదిలేసుకుంది. ఈ అమ్మడి లక్ ఆ తర్వాత ఓ రేంజ్‌లో సాగింది.
ఆమె చేసిన చిత్రాలన్నింటిలో ఆమె ఆ చిత్రాలకు స్పెషల్ అట్రాక్షన్ అయింది. 'క్షణం' చిత్రం చేసినా ఆదాశర్మకి దక్కని గుర్తింపు అనసూయ ఖాతాలో పడింది. 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రంలో కూడా ఆమెకి మంచి పేరు వచ్చింది. మరి లీడ్‌రోల్స్, క్యారెక్టర్‌రోల్స్ ఇస్తేనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తానని ఓపెన్‌గా చెప్పిన అనసూయ 'విన్నర్' చిత్రంలో మాత్రం ఐటంసాంగ్ చేసింది. ఎందుకు ఐటం సాంగ్ చేశారు? ఐటంలలో చేయనని చెప్పారు కదా..! అని ప్రశ్నిస్తే ఈ చిత్రంలో కేవలం తన పేరుతోనే పాట రాశారు కాబట్టి చేశాను అని సమాధానం ఇచ్చింది.
ఇక తాజాగా ఈ అమ్మడు లీడ్‌రోల్ వంటి క్యారెక్టర్‌రోల్ చేయడానికి ఒప్పుకుంది. తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎవరైనా ఓ పనిచేస్తామని ఫెయిల్ అయినా, లేదా తప్పటగులు వేసినా 'సచ్చిందిరా గొర్రె' అనే పదాన్ని ఊతపదంగా వాడుతారు. అనసూయ ఇప్పటి వరకు చేయని సరికొత్త పాత్రలో చేస్తున్న ఈ చిత్రం ఎలాంటి ప్రచారం లేకుండానే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. శ్రీధర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, శివారెడ్డి వంటి కమెడియన్లు నటిస్తున్నారు. ఈచిత్రంలో లీడ్‌రోల్ అంటూ ఏ పాత్రకు ఉండదని, అన్నిపాత్రలకు కథానుసారం సమానమైన ప్రాధాన్యత ఉంటుందని ఈ సెక్సీ భామ కవరింగ్ ఇస్తోంది. తెలంగాణ సాంస్కృతిక కళల్లో ఒకటైన ఒగ్గు కథ నేపధ్యంలో రూపొందుతోందని సమాచారం.