బాలయ్య నిజజీవితంలోనే కాదు... ఇతర విషయాలలో కూడా మూడ్‌ని బట్టి ఉంటాడు. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతాడో ఎప్పుడు ఎవరిని తిడతాడు? కొడతాడు? వంటి విషయాలు ఆయన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు కూడా తెలియదని అంటారు. ఇక ఆయన సినిమాలు, కథలు, దర్శకులను ఎంచుకోవడంలో కూడా ఆయన తేడా సింగేనంటారు. ఆయన అనూహ్యంగా తన వందో చిత్రాన్ని అప్పటివరకు కమర్షియల్ హిట్‌లేని క్రిష్‌కి, అందునా చారిత్రక గాధ అయిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఇచ్చాడు. 'బాహుబలి-ది బిగినింగ్' రిలీజైన తర్వాత కూడా లిమిటెడ్ బడ్జెట్‌లో కేవలం 79రోజుల్లో 'బాహుబలి' రేంజ్ టెక్నికల్ స్టాండర్డ్స్‌లో క్రిష్ ఆ చిత్రాన్ని తీయగలడనే నమ్మకంతో ఆయనకు చాన్స్ ఇచ్చాడు.
బోయపాటి, సింగీతం శ్రీనివాసరావు వంటి వారిని కూడా కాదని క్రిష్‌కే చేశాడు. ఇక తన101వ చిత్రంగా 'జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్' వంటి డిజాస్టర్స్‌లు ఉన్న పూరీ చేతుల్లో పెట్టాడు. కానీ ఈచిత్రం ఫ్లాప్ అయింది. ఇప్పుడు మరో ఫేడవుట్ అయిన తమిళ సీనియర్ దర్శకునికి 102వ చిత్రం చేస్తున్నాడు. నేటి జనరేషన్‌కి తగ్గట్లుగా సినిమాలు తీయలేకపోతూ, తన కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచి, విషయం రోడ్లధర్నాలు, నిరసనలతో హోరెత్తించి,ఇంతకాలం తాను కాపాడుకుంటూ వస్తున్న పరువుని బజారు పాలు చేసిన రవికుమార్‌ని ఏకంగా రజనీనే దూరంగా పెడితే ఈ ఫేడవుట్ దర్శకునికి బాలయ్య చాన్స్ ఇచ్చాడు. గతంలో కూడా రజనీకాంత్‌తో ఎన్నోహిట్స్ అందించి, చివరకు 'చంద్రముఖి' వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన పి.వాసుతో 'మహారధి' చేసి దెబ్బతిన్నా బాలయ్య పట్టించుకోవడంలేదు.
ఇక బాలయ్యకి 'పైసావసూల్' వంటి డిజాస్టర్‌ని ఇచ్చినా కూడా పూరీ మీద నమ్మకంతో తాను నటించే 103 చిత్రం కూడా మరలా ఇస్తున్నాడని తెలుస్తోంది. మరో పక్క బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రను బయోపిక్‌గా తీస్తానని అప్పట్లోనే చెప్పాడు. 'పైసా వసూల్' సమయంలో కూడా ఈచిత్రానికి పూరీ దర్శకత్వం వహిస్తాడని, ఈ విషయమై పూరీ, బాలయ్యల మధ్య డిస్కషన్స్ కూడా జరిగాయనేది వాస్తవమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. తాజాగా బాలయ్య చేసే ఎన్టీఆర్ బయోపిక్‌ని తీసే బాధ్యతను ఆయన దర్శకుడు తేజకి అప్పగించాలని వార్తలు రావడం నిజంగా షాకింగే. తేజ గతంలో మహేష్‌బాబుతో 'నిజం' తీశాడు. ప్రశంసలువచ్చినా కమర్షియల్ హిట్ కాలేదు. దాంతో కొత్తవారితో, కాస్త అనుభవం ఉన్న రానా వంటి మెయిన్‌టెయిన్ చేయగలిగిన దర్శకుడిగా తేజకు పేరున్నప్పటికీ స్టార్ హీరోలను హ్యాండిల్ చేసే విషయంలో ఎన్నో సందేహాలున్నాయి. గతంలో కూడా బాలయ్య ఎస్వీకృష్ణారెడ్డికి చాన్స్‌ఇచ్చి 'టాప్‌హీరో'తో డిజాస్టర్ అందుకున్నాడు.
బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తేజ చేతిలో పెట్టాడనే వార్త సంచలనంగా మారింది. మరోవైపు తేజ దర్శకునిగా దాదాపు 12 ఏళ్ల నుంచి హిట్ కాదు కదా..! కనీసం యావరేజ్ చిత్రం కూడా చేయలేదు. తాజాగా వచ్చిన 'నేనే రాజు..నేనేమంత్రి' చిత్రం రానా దగ్గుబాటికి 'బాహుబలి' వంటి చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్ రావడం, రానాకి పలు భాషల్లో గుర్తింపు ఉండటం వల్లే ఈచిత్రం కమర్షియల్‌గా హిట్టయింది. అందునా దర్శకుడు తేజ కథలను తయారు చేయడం, డెవలప్ చేయడం, దర్శకునిగా కూడా ఆయన స్టామినా ఈ చిత్రంలో కనిపించలేదు. ఈ కథను కూడా ఆయన తిమ్మిరెడ్డి అనే రచయిత నుంచి చోరీ చేశాడనే ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ బయోపిక్‌ని పూరీ, తేజల చేతిలో పెట్టకుండా తనకెప్పటి నుండో గోల్‌గా వున్న'నర్తనశాల' ఆగిపోవడంతో.. దర్శకత్వం చేయాలనే ఆయన తీరని కోరికను ఎన్టీఆర్ బయోపిక్‌కి ఆయనే స్వీయ దర్శకత్వం చేసి తీర్చుకుంటే బెటర్ అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.