తెలుగు టీవీ యాంకర్లలో సుమ, ఝాన్సీ, ఉదయభానులు యాక్టివ్‌గా ఉన్నంతకాలం కార్యక్రమాల నిర్వహణ, దుస్తులు, మాటలు వరకు అన్ని సంప్రదాయ బద్దంగా ఉండేవి. కానీ టీవీ యాంకర్లను కూడా తన దారిలో నడుచుకునేలా చేసి, తెలుగు టీవీకి వెండితెర రేంజ్‌కి చేర్చిన భామ మాత్రం అనసూయనే. ఆ తర్వాత అనసూయ దారిలో రేష్మి, శ్రీముఖి వంటివారు వచ్చారు. అలా ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఆమె తాను వేసే దుస్తులు, మాట్లాడే భాష మీద కొందరికి కోపం ఉండవచ్చు. కానీ ఆమె నేనింతే.. నా దుస్తులు నా కోసం వేసుకుంటాను. నాకు సౌకర్యంగా ఉండే దుస్తులే వేసుకుంటాను. ఆ డ్రస్‌లు ఎక్స్‌పోజింగ్ చేసే రేంజ్‌లో ఉన్నా నేను పట్టించుకోను..ఇష్టం ఉంటే చూడండి.. లేకపోతే మానేయండి అని ఇటీవలే ఓఅభిమానిని ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది.
నిజానికి ఆమె ఇద్దరు పిల్లల తల్లి. ఇక తల్లి అయినా టీవీ కార్యక్రమాల చాన్స్‌లకు ఢోకా ఉండదు గానీ సినిమాలలో మాత్రం.. అందునా గ్లామర్ ఒలకబోసే ఐటం పాటలు, ఇతర హాట్ ఎక్స్‌పోజింగ్ విషయాలు, సినిమాలో మంచి ఆఫర్లు రావడానికి తల్లి కావడం అనేది ఓ మైనస్ పాయింటే. కానీ దానిని కూడా అనసూయ అధిగమించింది. పవన్ పక్కన ఐటంసాంగ్‌లో 'అత్తారింటికి దారేది'లో అవకాశం వచ్చినా నో చెప్పి మెగాభిమానుల ఆగ్రహానికి లోనైంది. విషయానికి వస్తే ఆమె తాజాగా తన స్టిల్స్‌ని సోషల్‌మీడియాలో పెట్టి సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది.
వర్షాకాలం కావడంతో సీజన్‌కి అనుగుణంగా పైన గొడుగును పట్టుకుని, జబర్దస్త్ షోకి సంబందించిన కాస్ట్యూమ్స్‌తో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ ఫొటోలు చూస్తే ఆమె స్టార్ హీరోయిన్లకు కూడా పోటీ ఇవ్వడం ఖాయమనే విధంగా ఆమె పిక్ వైరల్ అవుతోంది. గొడుగుతో బ్లాక్ టాప్‌లో ముసి ముసి నవ్వులు నవ్వుతున్న స్టిల్ చూసి ఫిదా కాని ప్రేక్షకులే ఉండరు. ఇలా ఈమె కుర్రకారుకు కలలరాణిగా కనిపిస్తోంది. మరి అతి తక్కువ సమయంలోనే ఏకంగా తన పేరు మీదనే పాట రాయించుకున్న విషయం తెలిస్తే ఆమె తల్లి అయిన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అంటోంది ఈ భామ.....!