తెలుగింటి రాజోల్ సుందరి అయినా అంజలి తెలుగులో కంటే తమిళంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'లో వెంకటేష్‌కి జోడీగా, 'గీతాంజలి' చిత్రంలో లీడ్‌రోల్‌లో నటించి మంచి పేరు, సంప్రదాయ పాత్రలకు సరిపోతుందనే ఇమేజ్‌ని తెచ్చుకుంది. కానీ తెలుగులో మాత్రం ఆమె వయసుకు తగ్గట్లుగా కుర్రహారోలతో చాన్స్‌లు రాకుండా కాస్త వయసు మళ్లిన హీరోలతో సర్దుకుపోతోంది. ఇక తమ మొదటి చిత్రం నుంచి నటుడు జై తో ఆమె ఎఫైర్ నడుపుతూ, ఏకంగా సహజీవనం చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే వీరిద్దరు కలిసి నటించిన 'బెలూన్' చిత్రం విడుదల సిద్దమైన తరుణంలో వీరిపై ఘాడంగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పటికే జై, అంజలిలు చూచాయగా తమ ప్రేమను ఒప్పుకున్నారు. సూర్య నిర్వహించిన దోసె సవాల్ టైంలో వీరి భాగోతం బయటపడింది. తర్వాత ఇద్దరు తమ పెద్దలను అంగీకరించే పనిలో పడ్డారు. దాంతో ఆమె వివాహం అతి త్వరలోనే అనేది కన్‌ఫర్మ్ అయింది. అయినా వివాహం తర్వాత తనకు బాలీవుడ్‌లోలాగా అవకాశాలు రావని, కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులు పెళ్లయిన వారిని ఆదరించరని కనిపెట్టింది. దాంతో తాను కూడా రోజా, వాణివిశ్వనాథ్, హేమ, కవిత, జయప్రద, శారద వంటి వారి రూటులో తన పెళ్లి తర్వాత ఫ్యూచర్ ప్లాన్‌ని రెడీ చేసుకుంటోంది.
ఆ మధ్య ఢిల్లీ వెళ్లి పార్లమెంట్‌ను చూసి వచ్చింది. అప్పుడే ఆమె దాదాపు మూడుపార్టీల నేతలతో చర్చలు జరిపి, తన రాజకీయరంగ ప్రవేశం గురించి చర్చించిందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె వాటిని కొట్టి పడేసింది. తాను ఢిల్లీ వెళ్లిన సందర్భంగా పార్లమెంట్‌ని చూసి వచ్చానని, కానీ తనకు ఏ పార్టీలో చేరే ఉద్దేశ్యం కానీ, రాజకీయాలలోకి ప్రవేశించాలనే కోరిక లేదని తెలిపింది. కానీ తాజాగా అంజలి రాజకీయ ఎంట్రీపై మరలా వార్తలు షికారు చేస్తున్నాయి. కానీ ఈ సారి మాత్రం అంజలితో పాటు ఆమె సన్నిహితులు కూడా ఈ విషయాన్ని ఖండించకపోవడం గమనార్హం. మరి ఆమె ఏదైనా ప్రాంతీయ పార్టీలో చేరుతుందా? జాతీయ పార్టీలో చేరుతుందా? అనే దానిపై మాత్రం స్పష్టమైన సమాచారం లేదు. మొత్తానికి 2018లోనే ఆమె వివాహం, పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.