టాలీవుడ్ బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజుపై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. అయితే దిల్ రాజు మీద శ్యామల అనే కథా రచయిత మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎందుకంటే దిల్‌రాజు నిర్మించిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రం తన నవల ‘నా మనసు నిన్ను కోరే’ నుంచి కాపీ కొట్టారంటూ శ్యామల అనే ఆవిడ దిల్ రాజుపై కేసు పెట్టారు. అసలు తన నవలను ఆ సినిమా కోసం కాపీ కొట్టిన దిల్ రాజు, తన అనుమతి తీసుకోకుండా ఈ సినిమా తెరకెక్కించినట్లుగా ఆవిడ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.
ప్రభాస్ హీరోగా దశరధ్ దర్శకత్వంలో 2011లో వచ్చిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, తాప్సి లు నటించగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక తన అనుమతి లేకుండా తన కథని సినిమాగా తెరకెక్కించిన దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇక శ్యామల రిపోర్ట్ తో పోలీస్ లు దిల్ రాజు మీద సెక్షన్ 120ఏ, 415, 420 కాపీ రైట్స్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.