ఎన్టీఆర్ బుల్లితెర మీద హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందులోను ఎన్టీఆర్ ఎనర్జీ, పెరఫార్మెన్స్, అల్లరితో బిగ్ బాస్ షోని రక్తి కట్టిస్తున్నాడు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరో సినిమాలు విడుదలవుతున్నా.. వారు ఎన్టీఆర్ బిగ్ బాస్ లోకి వచ్చి అందులోని కంటెస్టెంట్స్ తో సరదాగా ఎంజాయ్ చేస్తూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. అలా 'నేనే రాజు నేనే మంత్రి' హీరో రానాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా వస్తున్న 'జై లవ కుశ' హీరోయిన్స్ రాశి ఖన్నా, నివేత థామస్, హీరో ఎన్టీఆర్, నిర్మాత కళ్యాణ్ రామ్ వరకు కొనసాగుతూ వస్తుంది.
ఇక బిగ్ బాస్ షో మరో వారంరోజుల్లో పూర్తి కాబోతుంది. అలాగే 'జై లవ కుశ' చిత్రం కూడా మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతుంది. ఇక 'జై లవ కుశ' హీరో, బిగ్ బాస్ హోస్ట్ ఎన్టీఆర్ కాబట్టి బిగ్ బాస్ స్టేజ్ మీద ఎన్టీఆర్ చేసే పెరఫార్మెన్సు తోపాటు... 'జై లవ కుశ' ప్రమోషన్ కి 'జై లవ కుశ' టీమ్ అంటే... హీరో ఎన్టీఆర్, నిర్మాత కళ్యాణ్ రామ్, హీరోయిన్స్ రాశి ఖన్నా, నివేత థామస్ లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. వారు బిగ్ బాస్ హౌస్ కి అతిధులుగా రావడమే కాదు.. ఎన్టీఆర్ అయితే ఏకంగా హౌస్ లో ఇన్స్పెక్షన్ కూడా చేయబోతున్నాడు. 'జై లవ కుశ' ప్రమోషన్ ని కూడా గట్టిగా ఇలా బిగ్ బాస్ హౌస్ ద్వారా చెయ్యనున్నారు. అయితే వీరంతా ఈరోజు శనివారమే బిగ్ బాస్ హౌస్ కి వెళుతున్నట్టుగా సమాచారం అందుతుంది.
ఎందుకంటే శని, ఆది వారాల్లో ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీదుంటాడు... కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ రామ్, రాశి ఖన్నా, నివేత లతో పాటే ఎన్టీఆర్ కూడా హౌస్ లోకి 'జై లవ కుశ' కోసం ఎంటర్ కాబోతున్నాడు. మరి 'జై లవ కుశ' సెప్టెంబర్ 21 న విడుదల సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లోకి వెళ్ళబోతున్నాయి అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలంటున్నారు. మరి ఇప్పటివరకు 'జై లవ కుశ' స్టేజ్ మీదే ఎన్టీఆర్ బిగ్ పెరఫార్మెన్సు కి అందరూ ఫిదా అయిపోతుంటే... ఇప్పుడు అన్నగారు కళ్యాణ్ రామ్, హీరోయిన్స్ రాశి, నివేదాలతో ఎన్టీఆర్ హౌస్ లో చేసే రచ్చ మాములుగా ఉండదనే విషయం బిగ్ బాస్ ప్రోమోస్ లో చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక 'జై లవ కుశ' టీమ్ ఇలా బిగ్ హౌస్ లోకి వెళ్లి తెలుగు ప్రేక్షకులకు ఇంటింటా దగ్గరవడానికి రెడీ అవుతున్నారన్నమాట. అలాగే ఎన్టీఆర్, రాశి ఖన్నా, నివేత థామస్ ల అల్లరి..బిగ్ బాస్ షోని ఎక్కడికో తీసుకెళ్లనుందనేది మాత్రం పక్కా.