Advertisementt

మురుగదాస్ పైనే అనుమానమా..?

Sat 16th Sep 2017 07:43 PM
mahesh babu,spyder,ar murugadoss,spyder negitive publicity,super star mahesh babu  మురుగదాస్ పైనే అనుమానమా..?
Negitive Publicity to Spyder Movie మురుగదాస్ పైనే అనుమానమా..?
Advertisement
Ads by CJ

దక్షిణాదిన నెంబర్ 1  దర్శకుల్లో దర్శకుడు మురుగదాస్ ఒకరు. మురుగదాస్ సినిమాలు వస్తున్నాయి అంటే తెలుగు, తమిళంలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజే ఉంటుంది. మురుగదాస్ కున్న స్టైల్ ప్రత్యేకంగా ఆయన సినిమాల్లో కనబడుతుంది. గజినీ, స్టాలిన్, తుపాకీ, కత్తి వంటి చిత్రాలతో మురుగదాస్ అంటే ఏమిటో నిరూపించుకున్నాడు. అవే తెలుగులో కూడా డబ్బింగ్, రీమేక్ అయ్యి హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే మురుగదాస్ చిత్రాలలో ఎక్కువగా మెసేజ్ మిక్స్ డ్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ఉంటాయి. అయితే మురుగదాస్ ఇప్పుడు తాజాగా మహేష్ బాబు హీరోగా స్పైడర్ అనే సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలం తెరకెక్కించి ఈ నెల 27 న విడుదల చెయ్యబోతున్నాడు.

మురుగదాస్ కి తమిళ వెర్షన్ స్పైడర్ మీదున్న శ్రద్ద తెలుగు వెర్షన్ మీద లేదంటున్నారు. తమిళంలో స్పైడర్ పబ్లిసిటీ విషయాల్లో కేర్ తీసుకుంటున్న మురుగదాస్ తెలుగులో మాత్రం లైట్ తీసుకుంటున్నాడనే టాక్ వుంది. ఇకపోతే స్పైడర్ టీజర్స్, స్పైడర్ సాంగ్స్, స్పైడర్ ట్రైలర్ ఏవీ కూడా మహేష్ అభిమానులను, సినిమా లవర్స్ ని, ఇండస్ట్రీ వర్గాలను అంతగా ఆకట్టుకోలేకపోయాయనే  టాక్ వినబడుతుంది. ఇప్పటివరకు ఉన్న మురుగదాస్ మార్క్ ఏమైంది. స్పైడర్ చిత్రంలో అది మిస్ అయినట్లు అనిపిస్తుందంటున్నారు. కాకపోతే సినిమా షూటింగ్ బాగా లేట్ అవడం... విడుదలకు సమయం ఆట్టే లేకపోవడంతో హడావిడిగా ఈ సాంగ్స్, ట్రైలర్ ని కట్ చేసి వదలడం వల్లనే ఇలా నాసిరకంగా అనిపిస్తున్నాయనే భావన కలుగుతుంది అంటున్నారు.

అసలు స్పైడర్ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందా? అసలు ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఏమంత ఆకట్టుకుంటుంది? అసలు బిసి సెంటర్స్ కి స్పైడర్ మూవీ ఎంతవరకు రీచ్ అవుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక బయో టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ స్పైడర్ ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందన్న అంచనాలకు వచ్చారు ప్రతి ఒక్కరు. కానీ ఇప్పుడు  మాత్రం స్పైడర్ ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ సినిమాలా కనబడుతుందా అంటున్నారు. అయితే మురుగదాస్ సినిమాలన్నీ ముందు ఎటువంటి టాక్ లేకుండా మొదలై..స్లో పాయిజన్ లో ఎక్కి, బ్లాక్ బస్టర్స్ అవుతాయి. ఇది తమిళ్ లో ఎవరిని అడిగిన చెబుతారు.  మరి ఈ  27 న  అన్ని అనుమానాలు తీరిపోతాయి. అప్పటి వరకు నెగిటివ్, పాజిటివ్ లతో మిక్స్డ్ పబ్లిసిటీ స్పైడర్ వశం కానుంది. 

Negitive Publicity to Spyder Movie:

Audience Disppoints with Spyder Promos

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ