10 రోజుల క్రితం శతమానంభవతి దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత దిల్ రాజులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కలిసి ఒక కథ చెప్పినట్లు... ఆ సినిమాకి టైటిల్ శ్రీనివాస కళ్యాణం పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. ఇక వారు చెప్పిన కథ విన్న ఎన్టీఆర్ సూపర్ గా ఉందని... దిల్ రాజుతో ఈ కథకు సరిపోయే మరొక డైరెక్టర్ ని వెతికితే సినిమా చేద్దామని చెప్పినట్లు... సతీష్ వేగేశ్న మీద నమ్మకం లేని ఎన్టీఆర్ ఈలెక్కన దిల్ రాజుకు సూచించినట్లు.... ఈ విషయంలో దిల్ రాజు ఎన్టీఆర్ మాట వినాలా... లేకుంటే సతీష్ కోసం ఎన్టీఆర్ ని వదులుకోవాలా అనే డైలమాలో ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. అలాగే త్రివిక్రంతో చెయ్యబోయే సినిమా మొదలు కావడానికి మూడు నెలల టైం ఉండడంతో ఎన్టీఆర్ ఈలోపు దిల్ రాజు బ్యానర్ లో శ్రీనివాస కళ్యాణం చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి.
అయితే ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది కొందరు ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర ప్రస్తావించగా... వారు ఎన్టీఆర్ ని అసలు దర్శకుడు సతీష్ వేగేశ్న కలవలేదని... దిల్ రాజు మాత్రమే ఎన్టీఆర్ ని మీట్ అయ్యి శ్రీనివాస కళ్యాణం స్టోరీ లైన్ వినిపించగా.... ఆ స్టోరీ లైన్ నచ్చిన ఎన్టీఆర్... దిల్ రాజుతో దర్శకుడు సతీష్ ని కథ మొత్తం సిద్ధం చెయ్యమని... ఎన్టీఆర్ చెప్పాడట. ఇక దిల్ రాజు, సతీష్ కి విషయం చెప్పగా సతీష్ వేగేశ్న ఆ సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో బిజీ అయినట్లుగా ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్న మాట. ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో చేసే సినిమా పూర్తయ్యేసరికి పక్కా స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉంటే ఆ సినిమా కంప్లీట్ కాగానే సెట్స్ మీదకెళ్ళొచ్చనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నాడట.
మరి ఇక్కడ విషయం ఇంత క్లియర్ గా ఉంటే బయట మాత్రం ఎన్టీఆర్ కి సతీష్ వేగేశ్న మీద నమ్మకం లేదు... సతీష్ వేగేశ్న ని ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు.... ఆయనకు కథ నచ్చింది గాని ఆయన నచ్చలేదంటూ రకరకాలుగా ప్రచారం జరిగింది. ఇక దిల్ రాజు నిర్మాతగా ఎన్టీఆర్ సినిమా అయితే పక్కా అనే విషయం మాత్రం క్లారిటీ వచ్చినట్లే అంటున్నారు.