తెలుగు ఇండస్ట్రీలో మాస్టర్ మైండ్ ఎవరు అంటే అందరు ఠక్కున అల్లుఅరవింద్ పేరే చెబుతారు. మెగాస్టార్ సాయంతో తన పెద్దకుమారుడు అల్లుఅర్జున్ కెరీర్‌కి దానిని ఉపయోగించుకుని రహదారి వేసుకున్నాడు. ఇప్పుడు తనకంటూ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడంతో అది చివరకు మెగాహీరోలను, మెగాభిమానులను పట్టించుకోని దశకు, 'చెప్పను బ్రదర్' అనే కామెంట్ ద్వారా తేటతెల్లమైంది. ఇక ఆయన తమ్ముడు అల్లుశిరీష్‌ను అరవింద్.. ప్రకాష్‌రాజ్ నిర్మాతగా 'గౌరవం' చిత్రంతో హీరోని చేశాడు. తర్వాత కొన్ని చిత్రాలలో నటించినా ఆయనకు యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది మాత్రం 'శ్రీరస్తు... శుభమస్తు' మాత్రమే. ఇక సినిమాలు చేయాల్సిన అవసరం శిరీష్ కి లేకపోయినా ఆయన ఫేస్‌ని ప్రేక్షకుల మదిలో నిలపాలని బలవంతంగా రుద్దుతున్నాడు.
బన్నీ 'గంగోత్రి'లో ఎలా ఉన్నాడు? మరి అతను ఎలాగోలా స్టార్ కాలేదా? మరి నాకేం తక్కువ అన్నట్లుగా శిరీష్, అరవింద్‌ల ధోరణి ఉంది. తెలుగులో పెద్ద మార్కెట్ లేకపోవంతో పాటు తెలుగువారు అందచందాలు, మంచి కంఠస్వరంతో పాటు ఎన్నో లక్షణాలు ఉంటేగానీ హీరోగా ఆమోదించరు. కానీ కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్‌లలో అలా కాదు. కాస్త మెప్పిస్తే ఆమోదించేస్తారు. అదే ప్లానింగ్‌తో తనకు తెలుగులోమార్కెట్ లేకపోయినా మలయాళం, తమిళం, హిందీలలో కాస్త క్రేజ్ తెచ్చుకున్నా కూడా 'బాహుబలి'కి ముందుగా దగ్గుబాటి రానా నడిచిన దారిలోనే శిరీష్ పయనించాలని అనుకుంటున్నాడు. దాంతో తన తండ్రి రికమండేషన్‌తో మలయాళంలో మేజర్ రవి దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన '1971 బియాండ్ ది బోర్డర్స్'లో ఓ పాత్ర చేశాడు.
ఇది వర్కౌట్ కాకపోయిన తన అన్నయ్య బన్నీకి మాలీవుడ్‌లో ఉన్న ఫాలోయింగ్ సాయంతోనైనా పాగా వేయాలని చూశాడు. ఇక ఆయన తమిళంలో రజనీకాంత్, హిందీలో హృతిక్‌రోషన్, తెలుగులో ప్రభాస్‌ల అభిమానులను ఆకట్టుకుని తనకు వారు సపోర్ట్‌గా ఉండేందుకు పెద్ద స్కెచ్ వేశాడు.దాంతో 'కబాలి'లోని రజనీకాంత్, 'బాహుబలి'లోని ప్రభాస్, 'క్రిష్' చిత్రంలోని హృతిక్ రోషన్‌ల బొమ్మలను తయారు చేయించి తన ఇంట్లోని తన గదిలో టేబుల్‌పై ఒకే చోట పెట్టి దానిని ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోకి మంచి స్పందన వస్తోంది. ఎన్ని అనుకున్నా తనకు మెగాఫ్యాన్స్, బన్నీఫ్యాన్స్‌ల మద్దతు ఉంటుందని, ఇక మోహన్‌లాల్, రజనీకాంత్, ప్రభాస్, హృతిక్‌ల బొమ్మలతో వారి ఫ్యాన్స్‌ని కూడా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ స్కెచ్‌లు ఎలా వర్కౌట్ అవుతాయో వేచిచూడాల్సివుంది....!