Advertisementt

'స్వింగ్ జరా'..పక్కా లోకలే బెటర్!

Sat 16th Sep 2017 05:19 PM
tamannah,jai lava kusa,swing jara song,jr ntr,jai lava kusa item song,kajal agarwal  'స్వింగ్ జరా'..పక్కా లోకలే బెటర్!
Jai lava Kusa Swing Jara Song Gets Divided Talk 'స్వింగ్ జరా'..పక్కా లోకలే బెటర్!
Advertisement
Ads by CJ

జై లవ కుశ ఆడియో పాటలన్ని ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి రావడం... జై లవ కుశ పాటల ప్రెస్ మీట్ కూడా జరగడం జరిగినా.... అందులో ఐటెం సాంగ్ అంటే తమన్నా సాంగ్ మాత్రం బయటికి రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా తమన్నా ఐటెం సాంగ్ కి సంబందించిన డీటెయిల్స్ ని చిత్ర బృందం తమన్నా పోస్టర్ తో పాటే  రివీల్ చేసింది. మరి తమన్నా ఆ ఐటెం లో ఎలా రెచ్చిపోయిందో ఆ పోస్టర్ లో హింట్ ఇచ్చేసింది జై లవ కుశ  యూనిట్. ఇక హింట్ తోపాటు జై లవ కుశ ఐటెం సాంగ్ ని కూడా వీడియో తో సహా యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర బృందం.

తమన్నాకి ఐటెం సాంగ్స్ లో నటించిన అనుభవం చాలానే ఉంది. ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడులో ఐటమ్స్ లో చిందులు తొక్కిన తమన్నా..... ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా ఐటెం డాన్స్ పర్వాలేదనిపించింది. ఇక తమన్నా జై లవ కుశలోని 'స్వింగ్ జరా' అనే పాటలో అందాల ఆరబోతతో పాటే డాన్స్ కూడా ఇరగదీసింది. ఈ ఐటెం సాంగ్ మొత్తం తమన్నా జై లవ కుశ లోని జై పాత్రని ఎంటర్టైన్ చెయ్యాటానికే. అయితే జై గంభీరంగా తమ్ము డాన్స్ ని చూస్తూనే తాను కూడా తమ్మూతో స్టెప్పులు కదపడం మాత్రం చాలా బాగుంది. మరి స్వింగ్ జరా సాంగ్ కి దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ అదుర్స్ అంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. తమన్నా మాత్రం ఈ సాంగ్ లో రెచ్చిపోయి డాన్స్ చేసింది కానీ..... ఎక్కడో ఎదో మిస్ అయ్యిందనే కామెంట్ మాత్రం వినబడుతుంది.

అయితే జై లవ కుశ చిత్ర బృందం మాత్రం తమన్నా స్పెషల్ సాంగ్ జై లవ కుశ కి ప్లస్ అవుతుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎన్టీఆర్ ఇంతకుముందు టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో జనతా గ్యారేజ్ లో ఆడి పాడిన ఐటెం అదరహో అనిపించేలా ఉందని... తమన్నా సాంగ్ జై లవ కుశలో తేలిపోయిందంటున్నారు. మరి ఇప్పటివరకు తమ్ము ఐటమ్స్ చేసిన సినిమాల్లో తమన్నా ఐటెం సాంగ్ కి పేరొచ్చిందికాని.... ఆమె ఐటమ్స్ చేసిన సినిమాలేవీ పెద్దగా విజయం సాధించలేదు. మరి ఇప్పుడు తమ్ము, ఎన్టీఆర్ కి అయినా విజయాన్ని అందిస్తుందో లేదో మరో ఆరు రోజుల్లో తెలిసిపోనుంది.  

Click Here to see The Swing Jara Song Promo 

Jai lava Kusa Swing Jara Song Gets Divided Talk:

Although four songs have already been released from Young Tiger NTR's Jai Lava Kusa, team JLK assured fans that there would be yet another song on cards and which would be the special song done by milky beauty Tamannah.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ