Advertisementt

మహేష్ బాబు..ఓ..రి..జి..న..ల్..!!

Fri 15th Sep 2017 10:11 PM
mahesh babu,chennai silks ad,spyder,prince mahesh,mahesh in chennai silks ad  మహేష్ బాబు..ఓ..రి..జి..న..ల్..!!
Mahesh Babu Chennai Silks Ad Creates Sensation మహేష్ బాబు..ఓ..రి..జి..న..ల్..!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో టాప్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు ఒక్క సినిమాలతోనే చేతినిండా సంపాదించడం లేదు. ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా దూసుకుపోవడమే కాదు..... చేతినిండా డబ్బు కూడా విపరీతంగా సంపాదించేస్తూ టాప్ లెవల్లో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో స్టార్స్ అందరిలో యాడ్స్ పరంగా మహేష్ బాబే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇక ఇప్పుడు తెలుగు, తమిళంలో 'స్పైడర్' చిత్రంతో ఈనెల 27 న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఇప్పటివరకు కేవలం తెలుగులోనే దూసుకుపోతున్న మహేష్ ఇప్పుడు తాజాగా తమిళంలో కూడా అడుగుపెడుతున్నాడు. అంటే ఈలెక్కన మహేష్ క్రేజ్ తమిళంలో కూడా ఎక్కువగానే ఉంటుంది.

మరి బాలీవుడ్ స్టార్స్ తో యాడ్స్ రంగంలో పోటీపడుతున్న మహేష్ బాబు తెలుగులో పలురకాల కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వుంటూ ఆయా కంపెనీల యాడ్స్ లో నటిస్తున్నాడు. గత రెండు మూడు నెలలుగా 'స్పైడర్' చిత్రంతో మీడియాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు... తమిళంలోనూ సందడి చేస్తున్న మహేష్ బాబు ఇప్పుడు తాజాగా అతను నటించిన కమర్షియల్ యాడ్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. మరి ఇప్పటికే పలు యాడ్స్ తో పాపులర్ అయినా మహేష్ బాబు ఇప్పుడు చెన్నై సిల్క్స్ వారి కమర్షియల్ యాడ్ లో ఓ..రి..జి..న..ల్..అంటూ సూపర్ గా నటించి అదరగొట్టేస్తున్నాడు. 

మహేష్ చాలా సింపుల్ గా కనిపిస్తూ అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ప్రస్తుతానికి మహేష్ బాబు ఇప్పుడు 'స్పైడర్' తో, చెన్నై సిల్క్స్ కమర్షియల్ యాడ్ తో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో ప్రేక్షకులను ఆకర్షించే పనిలో వున్నాడు.

Mahesh Babu Chennai Silks Ad Creates Sensation:

Mahesh Babu Original dialogue Sensation in Chennai Silks Ad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ