Advertisementt

స్పైడర్ ట్రైలర్ టాక్: శివ స్క్రీన్ బ్లింక్ అవుతోంది!

Fri 15th Sep 2017 07:53 PM
spyder,mahesh babu,spyder trailer talk,spyder trailer review,super star mahesh babu  స్పైడర్ ట్రైలర్ టాక్: శివ స్క్రీన్ బ్లింక్ అవుతోంది!
Spyder Movie Trailer talk స్పైడర్ ట్రైలర్ టాక్: శివ స్క్రీన్ బ్లింక్ అవుతోంది!
Advertisement
Ads by CJ

'స్పైడర్స్' టీజర్స్ చూసేసాం, పాటలు వినేసాం... ఇక 'స్పైడర్' థియేట్రికల్ ట్రైలర్ ని ఎప్పుడు చూస్తాం అంటూ మహేష్ అభిమానులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతోపాటు తమిళ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు - రకుల్ ప్రీత్ సింగ్ కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మురుగదాస్ హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించిన విషయం 'స్పైడర్స్' టీజర్స్ లోను, సాంగ్స్ లోను చూసేసాం. మరి ఈ సినిమా ఈ నెల 27 న విడుదలవుతున్న సందర్భంగా 'స్పైడర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తెలుగులో ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా.... స్పైడర్ థియేట్రికల్ ట్రైలర్ విడుదలచేద్దామనుకుంది చిత్ర బృందం. కానీ గత రాత్రి 10 , 11 గంటల సమయంలో స్పైడర్ ట్రైలర్  సడన్ గా యూట్యూబ్ లో ప్రత్యక్షమైంది. అయితే 'స్పైడర్' ట్రైలర్ లీకైంది అనేది అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అది ఎవరి దగ్గర నుండి లీకైంది పక్కన పెడితే... స్పైడర్ ట్రైలర్ ని ఆఫీషియల్ గురువారం అర్ధరాత్రి యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర బృందం. 

ఎప్పటినుండో చెబుతున్నట్టే మహేష్ బాబు 'స్పైడర్' లో ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గానే కనబడుతున్నాడు. నా పేరు శివ అంటూ తనని తానూ పరిచయం చేసుకుంటూ 'స్పైడర్' ట్రైలర్ ని స్టార్ట్ చేశాడు మహేష్. ఇక ఎవరైనా బెదిరింపు ఫోన్ కలర్స్ చేసినా... ఎవరైనా బాధపడుతున్నా.... అలాగే ఎవరైనా రక్షించమని కోరినా వెంటనే ఏజెంట్ శివ అలెర్ట్ అవుతాడు. ఇక మహేష్ తన ఫ్రెండ్ ప్రియదర్శితో నేను 'స్పైడర్ మ్యాన్ నో.... సూపర్ మ్యాన్ నో కాదు... అలాగే నేను సొసైటీ ని మార్చట్లేదు' అనే డైలాగ్ బావుంది. అలాగే స్పైడర్ విలన్ ఎస్ జె సూర్య మేకలకన్నా ఎక్కువగా మనుషులున్నారు, వాళ్ళని చంపితే తప్పేంటి అంటూ జనాల మీద పెద్ద పెద్ద బండలెక్కించేస్తూ సొసైటీ ని నాశనం చేయాలనుకుంటాడు. అయితే మహేష్ మాత్రం విలన్ ఆటలు కట్టిస్తూ సొసైటీ ని కాపాడుతుంటాడన్నమాట.

ఇకపోతే హీరోయిన్ రకుల్ తో మహేష్ రొమాన్స్ పాటల్లో, సన్నివేశాల్లోను అదిరిపోయినట్టే కనబడుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ తో మహేష్ లైబ్రేరిలో ఎలా మాట్లాడుకుంటాం అంటే... దానికి రకుల్ 'కిస్ కిస్' అంటూ మాట్లాడుకుందాం అంటుంది.. దానికి మహేష్ కూడా హా 'కిస్ కిస్' అంటూ మాట్లాడుకుందాం అంటాడు. అలాగే విలన్ మనుషుల్ని టార్గెట్ చేసినప్పుడు మహేష్ ఆవేశం, మొహంలో ఎక్సప్రెషన్స్ అన్ని బావున్నాయి. ఇక రకుల్ కూడా చేస్తున్నది డాక్టర్ వృత్తి అయినా దేవుళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ కనబడుతుంది ఈ ట్రైలర్ లో. 

మరి 'స్పైడర్' ట్రైలర్ లో మురుగదాస్ మార్క్ ప్రతిఒక్క సీన్ లోను కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సంతోష్ శివన్ విజువల్స్, అలాగే హ్యారిస్ జయరాజ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అన్ని 'స్పైడర్' కి పెద్ద ప్లస్ అనే విషయం ట్రైలర్ లో తెలుస్తుంది. ఇక ఈ చిత్రం మరో 12 రోజుల్లో విడుదల కాబోతుంది. ఇక ఈరోజు శుక్రవారం స్పైడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.

Click Here to see the TRAILER 

Spyder Movie Trailer talk:

Spyder Movie Theatrical Trailer Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ