కొందరు వ్యక్తులు చిన్నతనం నుంచి ఎంతో సున్నితంగా ఉంటారు. చీమలు, దోమలని చంపడం కూడా ఇష్టంలేనంత జాలి, దయతో ఉంటారు. కానీ వారి పట్ల సమాజం, అందులోని మనుషులు వికృతంగా, శాడిజంగా బిహేవ్ చేయడంతో వారికి సమాజంపై, అందులోని వ్యక్తులపై తీవ్ర నిరసన భావం ఏర్పడుతుంది. దాంతో వారు ఒక విధమైన సైకోలుగా మారి, తమ ప్రతి మాట, చేష్ట ద్వారా సమాజంలోని పెద్దలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. మంచితనాన్ని తీసి పక్కనపెట్టి ఇష్టం వచ్చినట్లు.. అందరినీ దూషిస్తూ, సమాజంలో జరిగే ప్రతి సంఘటనను వ్యతిరేక దృష్టితో చూడటం మొదలుపెడతారు. అదే సమయంలో వారు ఎంతో తెలివైన వారిగా కూడా ఉంటారు. అలాంటి కోవకి దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చెందుతాడు. ఆయన తల్లి చెప్పే మాటలు కూడా వింటే అందులో నిజం ఉందని అనిపిస్తుంది.
ఆయన తల్లి సూర్యావతి ఓ సందర్భంలో మాట్లాడుతూ, ఓ తల్లిగా చెప్పడం లేదు. వర్మకి చెడ్డతనం అంటే తెలియదు. మరోకరు తనను ఓ మాట అనకుండా అన్నీ తనను తానే అనేసుకుంటాడు. ఒకరికి సమాధానం, సంజాయిషీ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోడు. నా దృష్టిలో వర్మ చేసిన ఒకే ఒక్క తప్పు ఆయన పెళ్లి చేసుకోవడం. కోడలు ప్రతి విషయంలో మంచిదైనా, ఆమెది తప్పు లేకపోయినా వర్మ ఒంటరిగా ఉండాలని కోరుకోవడంతో తన భార్యకు దూరమయ్యాడు. వర్మ చిన్నప్పటి నుంచి దోమలను చంపినా ఊరుకునే వాడు కాదు. వాటిని సున్నితంగా తరమాలి గానీ ఎందుకు చంపాలి? అని ప్రశ్నించేవాడు. వర్మ అంత మంచోడు.
కూతురిని, అమ్మని, తమ్ముడిని అందరినీ బాగా చూసుకునే వాడు. అందరినీ బాగా అర్ధం చేసుకునే వాడు. విడాకుల తర్వాత కూడా తన కూతురికి కావాల్సినవన్నీ తానే చూసుకునే వాడు... అని చెప్పింది ఆయన తల్లి సూర్యావతి. ఇక తాజాగా వర్మ తాను టీనేజ్‌లో తన తల్లితో దిగిన ఓ ఫోటోను సోషల్‌మీడియాలో పెట్టాడు. ఈ ఫోటోకి మంచి స్పందన లభిస్తోంది. అమ్మ ఎంతో బ్యూటిఫుల్ అని చెబుతూనే పక్కన ఉన్న పిల్లవాడు ఓ జోకర్ అని తన మీద తానే ఓ సెటైర్ వేసుకున్నాడు. మరి ఇలా వర్మ మారడానికి ఏ పరిస్థితులు దారితీశాయి? ఆయనను మానసికంగా ఇలా మారడానికి కారకులు ఎవరు? అనే విషయం ఎప్పుడు తెలుస్తుందో...?