Advertisementt

చైతు-సామ్ ల తర్వాత మెగా హీరో-హీరోయిన్!

Thu 14th Sep 2017 10:47 PM
sai dharam tej,regina cassandra,marriage,lover birds,mega hero and heroine  చైతు-సామ్ ల తర్వాత మెగా హీరో-హీరోయిన్!
Sai Dharam Tej's Marriage With Star Heroine Regina చైతు-సామ్ ల తర్వాత మెగా హీరో-హీరోయిన్!
Advertisement
Ads by CJ

తెలుగు సినిమాల విషయానికి వస్తే తోటి నటీనటులను పెళ్లి చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. కృష్ణ-విజయనిర్మల, రాజశేఖర్‌-జీవిత, నాగార్జున-అమల, మహేష్‌బాబు-నమ్రతాశిరోదర్కర్‌, పవన్‌కల్యాణ్‌-రేణూదేశాయ్ నుంచి త్వరలో వివాహం చేసుకుంటున్న నాగచైతన్య-సమంతల వరకు ఎందరో ఉన్నారు. వీరిలో పవన్‌, రేణుదేశాయ్‌లు తప్ప మిగిలిన అందరూ హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారు. ఇక మెగా హీరోలల్లో మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ కాస్త డిఫరెంట్‌. ఈయన వరుణ్‌తేజ్‌ కన్నా అమ్మాయిలు, ఎఫైర్లలో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. మొదట ఆయన మెగాబ్రదర్‌ నాగబాబు కుమార్తె, హీరోయిన్‌ నిహారిక కొణిదెలను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిని వారితో పాటు పెద్దలు కూడా ఖండించారు. 

ఇటీవల సమంతకు నిశ్చితార్ధం జరిగిపోయి త్వరలో పెళ్లి అన్న తర్వాత కూడా నాగచైతన్య, సమంతను ప్రేమలోకి దించాడని, అది అలా జరగకుండా ఉంటే తానే సమంతను ప్రేమించి, వివాహం చేసుకునే వాడినని చెప్పి సంచలనం సృష్టించాడు. ఇక ఆ తర్వాత 'పిల్లానువ్వులేని జీవితం' చిత్రం షూటింగ్‌లో హీరోయిన్‌ రెజీనాను ఆయన, ఆయన్ను రెజీనా ఇష్టపడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' షూటింగ్‌ అమెరికాలో జరుగుతున్న సందర్భంగా వీరిద్దరు తమ ప్రేమను ఒకరినొరు వ్యక్తపరుచుకున్నారని, తన ప్రేమ విషయం ఇప్పటికే ఇరు పెద్దల అంగీకారం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. 

కానీ వీరిద్దరు మీడియాతో మాత్రం ఇద్దరం క్లోజ్‌గా ఉన్నంత మాత్రాన ప్రేమలో పడినట్లా? వరుస చిత్రాలు చేస్తే ఎఫైర్‌ ఉన్నట్లేనా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా ఈ మెగా ఫ్యామిలీ ప్లేబోయ్‌ వచ్చే ఏడాది ఎలాగైనా రెజీనాను పెళ్లి చేసుకోవాలని పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇద్దరి కెరీర్లు ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నందువల్ల కొంతకాలం ఆగుదామని రెజీనా అంటోందట. మరి ఈ ఇద్దరి వ్యవహారం ఎప్పుడు క్లైమాక్స్‌కు చేరుతుందో వేచిచూడాల్సివుంది....! 

Sai Dharam Tej's Marriage With Star Heroine Regina:

Latest news doing rounds in film nagar circles is about the marriage of love birds Mega Hero Sai Dharam Tej with actress Regina Cassandra.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ