Advertisementt

కోరికలన్నీ షూటింగ్‌ స్పాట్‌లో తీర్చుకుంటున్నారు!

Thu 14th Sep 2017 06:55 PM
saaho,prabhas,shraddha kapoor,hyderabadi delicacies  కోరికలన్నీ షూటింగ్‌ స్పాట్‌లో తీర్చుకుంటున్నారు!
Prabhas Treats Shraddha Kapoor With Hyderabadi Dishes కోరికలన్నీ షూటింగ్‌ స్పాట్‌లో తీర్చుకుంటున్నారు!
Advertisement
Ads by CJ

ఓ సినిమాలో స్టార్స్‌ నటిస్తున్నారంటే ఆయా నిర్మాతలకు ఏమీ మాట్లాడే అవకాశం, ఎదిరించే తెగువ రాదు. దాంతోనే కిందటితరం ఓ స్టార్‌ హీరో  షూటింగ్‌ల  కోసం ఆయనకు తయారు చేయించిన కాస్ట్యూమ్స్‌ నుండి, ఆ సినిమా షూటింగ్‌లో వాడే విలువైన వస్తువుల వరకు తన ఇంటికి తీసుకొని, తన సొంతానికి స్వాహా చేసేవాడని, కానీ ఆయన స్టార్‌ కావడంతో అడిగే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదనే విషయాన్ని పలువురు సీనియర్లు చెబుతూ ఉంటారు. మరికొందరు స్టార్‌ స్టేటస్‌ ఉండేవారు... తాము ఇంట్లో కూడా తినని వంటకాలను, తమకు ఇష్టమైన పదార్ధాలన్నింటినీ ప్రొడక్షన్‌ టీమ్‌ని అడిగి మరీ చేయించుకుంటారు. దీనికి నిర్మాతలు ఏమాత్రం అడ్డుచెప్పరు. దాంతో చివరకు సినిమా తీయడంలో నిర్మాతలకు రెమ్యూనరేషన్‌ తర్వాత అంతగా ఖర్చయ్యేది తిండి, తినుబండారాలు వంటి వాటికే. 

కాగా విషయానికి వస్తే 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ ప్రస్తుతం యువి క్రియేషన్స్‌ బేనర్‌లో 'సాహో' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దాకపూర్‌ నటిస్తోంది. ఆమె తాజాగా సెట్స్‌లోకి అడుగుపెట్టింది. దీంతో ప్రభాస్‌, శ్రద్దాలు డిమాండ్‌ చేయకపోయినా కూడా వారిని మెప్పించడం కోసం వీరిద్దరి కోసం యూనిట్‌ ఏకంగా 18 రకాల హైదరాబాద్‌ వంటకాలను సిద్దం చేసిందట. ప్రస్తుతం ఈ వంటకాల ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రద్దాకపూర్‌ మాట్లాడుతూ, తనకు వడాపావ్‌, సుషీలంటే చాలా ఇష్టమనిచెప్పింది. ఇక ప్రభాస్‌ తనకు ఇంటిలో తయారైన బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. అలా ఇంటర్వ్యూలలో వారు చెప్పిన తమ ఇష్టమైన వంటకాల విషయం గురించి తెలుసుకున్న ఈ చిత్రం ప్రొడక్షన్‌ని నిర్మాతలు అలాంటి మంచి వంటకాలన్నీ తయారు చేయించి ప్రభాస్‌, శ్రద్దాకపూర్‌ల ముందు ఉంచటంతో శ్రద్దాకపూర్‌ ఎంతో ఆనందానికి, ఆశ్యర్యానికి లోనైందట. మొత్తానికి స్టార్స్‌ కోరుకుంటే కొండ మీద కోతిని తెమ్మన్నా మన నిర్మాతలు తెచ్చి వారి ముందు పెడతారన్న దానికి ఇదో ఉదాహరణ మాత్రమే. 

Prabhas Treats Shraddha Kapoor With Hyderabadi Dishes:

Actress Shraddha Kapoor has started shooting for Prabhas starrer 'Saaho'. While on the sets, she indulged in some lip-smacking Hyderabadi delicacies, a source said.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ