మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి' ని భారీ లెవల్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇండియా వైడ్ గా విడుదల చెయ్యడానికి అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నారు దర్శక నిర్మాతలు. దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా' చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా... రామ్ చరణ్ భారీ బడ్జెట్ పెడుతూ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఎన్నో రోజుల నుండి పకడ్బందీగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి మరీ ఈ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లింది చిత్ర బృందం. ఈ సినిమాకి జాతీయ స్థాయిలో హైప్ రావడానికి 'సై రా' కోసం జాతీయ స్థాయి నటులను ఎంపిక చేసిన విషయము తెలిసిందే.
అందులో భాగంగానే 'సై రా నరసింహారెడ్డి'కి మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఏ ఆర్ రెహ్మాన్ ని తీసుకున్నారు. రెహ్మాన్ తో చర్చలు జరిపి 'సై రా' కోసం భారీ పారితోషికం ఇచ్చి మరీ ఆయన్ని ఈ సినిమా కోసం ఫైనల్ చేశారు సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ లు. ఈ విషయాన్ని అధికారికంగా మోషన్ పోస్టర్ విడుదల రోజునే ప్రకటించారు కూడా. మరి ఏ ఆర్ రెహ్మాన్ ని 'సై రా' టీమ్ అయితే అధికారికంగా ప్రకటించింది కానీ.. ఏ ఆర్ రెహ్మాన్ మాత్రం చిరుతో సినిమా చేయబోతున్నట్లు ఎక్కడా హింట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు 'సై రా' నుండి ఏ ఆర్ రెహ్మాన్ తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కేవలం రెహ్మాన్ కి ఉన్న ప్రీవియస్ కమిట్మెంట్స్ వల్లే ఏ ఆర్ రహమాన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు అని టాక్.
మరి ఏ ఆర్ రెహ్మాన్ కి ఈ సినిమా చెయ్యడం ఇష్టం లేకే 'సై రా' మోషన్ పోస్టర్ కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించేందుకు సాకులు చెప్పాడని కూడా అంటున్నారు. మరి ఇప్పుడు ఏ ఆ రెహమాన్ ప్లేస్ లోకి 'సై రా నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ కి మ్యూజిక్ అందించిన ఎస్ ఎస్ థమన్ నే ఇప్పుడు పూర్తి స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ గా 'సై రా' టీమ్ ఎంపిక చెయ్యబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అప్పుడు తమన్ 'సై రా' కోసం ఆశపడి భంగపడ్డాడనే వార్తలు చాలానే వాచ్చాయి. మరి ఇప్పుడు థమన్ ఆశలు నెరేవేరే రోజు వచ్చినట్టే అనిపిస్తుంది.