తరుణ్ భాస్కర్ 'పెళ్లి చూపులు' సినిమాకి దర్శకత్వం చేసి చాలా రోజులైంది. ఆ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ మళ్ళీ ఇంతవరకు ఏ హీరోకి, ఏ నిర్మాతకి కమిట్ కాలేదు. అయితే తరుణ్ భాస్కర్ మాత్రం నిర్మాతలు రాజ్ కందుకూరితో పాటే సురేష్ బ్యానర్ కి సినిమాలు చేస్తానని కమిటయ్యాడు. అయితే సురేష్ బ్యానర్ లో నిఖిల్ హీరోగా సినిమా మొదలవ్వబోతున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. మరి 'పెళ్లి చూపులు' వంటి బంపర్ హిట్టిచ్చినా తరుణ్ కి ఇంతవరకు సినిమా సెట్ కాకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమైనప్పటికీ తరుణ్ భాస్కర్ మాత్రం తన నెక్స్ట్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడన్నది మాత్రం అర్ధమవుతుంది. అయితే తరుణ్ మాత్రం సురేష్ బ్యానర్ లోనే సినిమా చెయ్యడానికి సిద్ధంగా వున్నాడని అంటున్నారు.
అయితే తరుణ్ ఇప్పుడు తాను దర్శకత్వం వహించబోయే సినిమాలో ఒక చిన్న హీరోని తీసుకుంటున్నాడని టాక్. గతంలో 'వెళ్లిపోమాకే' అనే చిన్న సినిమా చేసిన విష్వక్ సేన్ అనే హీరోతో తరుణ్ భాస్కర్ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి తరుణ్ మళ్ళీ చిన్న హీరోనే తీసుకుంటున్నాడు అంటే మరి మళ్ళీ 'పెళ్లి చూపులు' లాంటి సినిమాకే ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది. అయితే తరుణ్ భాస్కర్ గతంలో తాను తీసిన 'సైన్మా' అనే షార్ట్ ఫిలింని ఇప్పుడు 2.30 గంటల సినిమాగా మలచబోతున్నట్లుగా చెబుతున్నారు.
యూట్యూబ్ లో సూపర్ హిట్ అయిన 'సైన్మా' షార్ట్ ఫిలింని సినిమాగా మార్చాలనేది తరుణ్ భాస్కర్ తన కోరిక గా చాలా సార్లు చెప్పాడు. కానీ అది ఇప్పటివరకు కుదరలేదు. మరి ఆకథతోనే ఇప్పుడు తరుణ్ భాస్కర్ విష్వక్ సేన్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమాని తెరకెక్కిస్తున్నాడా? లేదా మరో కథని తీసుకుని సినిమాగా చేస్తాడా అనేది పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.