ఆ మధ్య దర్శకధీరుడు రాజమౌళి తాను సీనియర్ స్టార్స్‌తో చిత్రాలు చేయనని, వారితో తనకు కంఫర్ట్‌గా అనిపించదని, అందుకే కేవలం ఈతరం హీరోలతోనే చిత్రాలు తీస్తానని చెప్పాడు. మరి ఆయన అంతలా ఎందుకు వెక్స్ అయ్యాడు? ఆయన ఏ విషయంలో సీనియర్‌స్టార్స్ విషయంలో ఇబ్బందిగా ఫీలయ్యాడు? అనేది మాత్రం ఆయన చెప్పలేదు. కేవలం 'రాజన్న' చిత్రం కోసం నాగార్జున మీద వచ్చే యాక్షన్ సీన్స్‌ని, మగధీర లో చిరంజీవి పై 2 సీన్స్ ని తప్ప, పూర్తిగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో చిత్రాలు తీయలేదు.
ఇక విషయానికి వస్తే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం 'శ్రీవల్లి' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈచిత్రం ఈనెల 15 వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకి రామ్‌చరణ్ అతిధిగా వచ్చాడు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పాడు. 'సింహాద్రి' తర్వాత రాజమౌళికి చిరంజీవితో చిత్రం ఎప్పుడు? అనే ప్రశ్న ఎదురైంది. తెలుగు పరిశ్రమలో ప్రతి దర్శకుడి అంతిమ లక్ష్యం చిరంజీవితో చేయడమే. చిరంజీవి వరమివ్వాలి కదా...! అని దానికి రాజమౌళి బదులిచ్చాడు. తర్వాత కొద్ది రోజులకే వారికి చిరంజీవి నుంచి పిలుపువచ్చింది. తనతో చిత్రం చేయమని ఆయన అడిగారు. అది ఆయన గొప్పతనమే. వెంటనే 'మగధీర' అనే స్టోరీని రాసి, 100 మంది ఫైటర్స్ ఎపిసోడ్‌ని డిజైన్ చేసి ఆయనకు వినిపించాం. ఆయన వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం మేము స్పష్టంగా గమనించాం. అయితే ఆ కథను ఆయనతో చేయలేకపోయాం. ఆ కథను వేరే ఎవ్వరితో చేయనని రాజమౌళి అనడంతో రామ్‌చరణ్‌తో చేసే చాన్స్ వచ్చింది. అది కేవలం రామ్‌చరణ్‌కి రెండో చిత్రం మాత్రమే. చిరంజీవి వారసత్వం కారణంగానే రామ్‌చరణ్ ఆ పాత్రను అద్భుతంగా చేయగలిగాడు. చిరంజీవికి ఎంతో ఖ్యాతి ఉంది.
రామ్‌చరణ్ ఆయన 'ఖైదీ నెంబర్ 150' చిత్రం నిర్మించడం ద్వారా అంతకు మించిన ఖ్యాతి సంపాదించుకున్నాడు.. అన్నారు. అంతే కాదు.. అక్కడే ఉన్న పరుచూరి గోపాలకృష్ణని చూసి 'సై..రా.. నరసింహారెడ్డి' వంటి చిత్రానికి పనిచేసే మహాద్భుత అవకాశం మీకొచ్చిందంటూ చెప్పాడు. 10శాతం రచయిత రాసిస్తే 100శాతం నటించగలిగే అద్భుతమైన నటుడు మెగాస్టార్ అని అక్కడే ఉన్న పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. మొత్తానికి యువ దర్శకుల తరంలో రాజమౌళి, పూరీ జగన్నాథ్ వంటి వారితో చిరంజీవి తన కెరీర్‌లో కనీసం ఒక్క చిత్రమైనా చేస్తాడా? అనేది ఆసక్తిని కలిగించే విషయం. ఈ వేడుకను చూస్తే 'ఆగడు' చిత్రం ఫంక్షన్‌లో హీరోలని ఆకాశానికెత్తేశాలా.. ఆ పొగడ్తలేంట్రా అనే తరహాలో ఈ వేడుక అంతా ఒకరినొకరు పొగుడుకోవడమే సరిపోయిందంటూ సెటైర్లు పడుతున్నాయి.