Advertisementt

'బాస్ ఈజ్ బ్యాక్' అనేంత బిల్డప్ ఇస్తున్నారు!

Tue 12th Sep 2017 04:17 PM
udaya bhanu,neethone dance show,star maa,the queen is back,boss is back  'బాస్ ఈజ్ బ్యాక్' అనేంత బిల్డప్ ఇస్తున్నారు!
Udaya Bhanu Is Back With Star Maa Neethone Dance Show 'బాస్ ఈజ్ బ్యాక్' అనేంత బిల్డప్ ఇస్తున్నారు!
Advertisement
Ads by CJ

తెలుగు చానెల్స్‌ని తొలినాళ్లలో సుమ, ఝూన్సీ, ఉదయభానులు ఏలారు. ముగ్గురు చూడటానికి సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూ తమ వాక్చాతుర్యంతో వీక్షకులను అలరించారు. కేవలం టీవీ షోలకే కాదు.. పలు సినిమా వేడుకలకు వారు హోస్ట్‌గా చేసి మెప్పించారు. ఇక సుమ, ఝాన్సీ నిండుగా కనిపిస్తే నాడు బుల్లితెరపై యాంకర్లు కూడా గ్లామర్‌ రసం పడించడం ఉదయభానుతోనే మొదలైంది. ఇక సుమ, ఝాన్సీలగానే ఉదయభాను కూడా కొన్ని చిత్రాలలో నటించింది. 

దాసరి దర్శకత్వంలో వచ్చిన 'కొండవీటి సింహాసనం', లీడర్ వంటి మూవీస్‌లో ఐటంసాంగ్స్‌ కూడా చేసింది. మొత్తానికి నేడు అనసూయ, రేష్మి, శ్రీముఖిల ద్వారా పెరిగిన గ్లామర్‌షోకి తొలి అడుగు మాత్రం ఉదయభానునే వేసిందని చెప్పాలి. ఇక ఇటీవల ఆమె వివాహం చేసుకుని కొంతకాలంగా షూటింగ్‌లకు బ్రేక్‌నిచ్చింది. కవల పిల్లలకు జన్మనిచ్చి ఇటీవలే వారిద్దరి బర్త్‌డేలను గ్రాండ్‌గా జరిపింది. అలాంటి చలాకి ఉదయభాను త్వరలో మరో టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్‌ మా టీవీ కోసం రూపొందుతున్న 'నీతోనే డ్యాన్స్‌' అనే  షోలో ఉదయభాను కనిపించనుంది. 

'ది క్వీన్ ఈజ్‌ బ్యాక్‌' అంటూ స్టార్‌ మా వారు వదిలిన వీడియో బిట్‌ ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. అసలే వేదిక మీద ఉంటే మాటలతో పాటు చేష్టలతో కూడా క్షణం ఖాళీగా ఉండని ఉదయభాను, బుల్లితెర వీక్షకులను ఎంత మాత్రం ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది. ఇక ఇదేదో చిరంజీవికి 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటూ పబ్లిసిటీ ఇచ్చినట్లుగా ఈ ఉదయభానుకి 'భాను ఈజ్‌ బ్యాక్‌' అంటూ చేస్తున్న ప్రచారం ఒకవైపు నవ్వుతెప్పిస్తున్నా.. లేడీ యాంకర్‌గా ఉదయభానుని కూడా మనం అందరిలోకి స్టార్‌గా భావించాలనేది స్టార్‌ మా చానెల్‌ వారి అభిమతం కాబోలు....! 

Click Here Udaya Bhanu Neethone Dance Promo

Udaya Bhanu Is Back With Star Maa Neethone Dance Show:

Udaya Bhanu is a popular anchor on the small screen.  Apart from TV shows, she is popular for hosting film functions as well.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ