'జై లవ కుశ' సంబరాలు స్టార్ట్ అయ్యాయి. ఈ ఆదివారం సాయంత్రం 'జై లవ కుశ' థియేట్రికల్ ట్రైలర్ ని చిత్ర బృందం అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా లాంచ్ చేసింది. ఈ వేడుకకి నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, రాశి ఖన్నా, నివేత థామస్, కోన వెంకట్, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు వేల సంఖ్యలో పాల్గొని ఈ వేడుకని సక్సెస్ చేశారు. ఇక ఇప్పటి వరకు జై, లవ, కుశ టీజర్స్ తో దడదడ లాడించిన ఎన్టీఆర్ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో హడలెత్తించాడు. జై గా ఆగ్రహావేశాలను.... లవ చేసే ఎంటర్టైన్మెంట్... కుశ చేసే కామెడీ యాక్షన్ సన్నివేశాలతో జై థియేట్రికల్ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.
జై, లవ, కుశ ఒకే తల్లి కడుపున పుట్టినా రావణ, రామ, లక్ష్మణులు అంటే ముగ్గురు రామలక్ష్మణభరతులు కాకుండా అందులో ఒకరు రావణుడులాంటి భయంకరమైన ఆగ్రహావేశాలతో అచ్చం రావణుడిలాగే బిహేవ్ చేసే పాత్రలో ఎన్టీఆర్ ఉన్నాడు చూడండి... నిజంగానే రావణుణ్ణి చూస్తున్నాము అన్నంతగా ఎన్టీఆర్ నటనతో మెప్పించాడు. ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించాడు జై పాత్రలో. ఇక లవ పాత్రలో అమాయకత్వమే కాదు అతనిలో దాచుకున్న అల్లరిని కాస్త ఎంటెర్టైమెంట్ జొప్పించి సూపర్ గా ఆకట్టుకున్నాడు. ఇక కుశ పాత్ర టీజర్లో లానే కామెడీ యాక్షన్ తో అదరగొట్టేశాడు. ఇమ్మిగ్రేషన్ లాయర్ ని ఇరిటేషన్ లాయర్ గా మార్చేసి నవ్వించేస్తున్నారు కుశ మరియు మిత్రుడు. ఇక జై పాత్రలోని ఎన్టీఆర్ నత్తి అతని పాత్రకే హైలెట్ అయ్యేలా కనబడుతుంది. మొహంలో ఎక్సప్రెషన్స్ తో పాటు ఆ నత్తిని మిక్స్ చేసి ఇరగదీస్తున్నాడు. అసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు... అంటూ జై చెప్పే డైలాగ్ సూపర్బ్. అంతేకాదు... మానమనేది అబద్దం....నే... నే... నేనదే నిజం అంటూ ఇరగదీస్తున్నాడు జై. ఘట్టమేదైనా పాత్ర ఏదైనా నేను రే... రే... రెడీ అంటూ జై పాత్ర చెప్పే నత్తి డైలాగ్ కేక పుట్టిస్తున్నాయి.
అలాగే 'ట్రింగ్ ట్రింగ్ మంది గుండెల్లోనా...' అనే పాటలో ఎన్టీఆర్ డాన్స్, హీరోయిన్ రాశి ఖన్నా అందాలు, మరొక పాటలో నివేత థామస్ హాట్ అప్పీల్.. అలాగే హంస నందిని చీరలో చూపించిన అందాలు, నందిత రాజ్ పెళ్లి కూతురు గెటప్, 'జై లవ కుశ' లోని విలన్స్ అలా వచ్చి ఇలా మాయమైనా కూడా అన్ని 'జై లవ కుశ' ట్రైలర్ కి స్పెషల్ అట్రాక్షన్స్. ఇక దేవిశ్రీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్... చోటకే నాయుడు ఫోటోగ్రఫి... అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ట్రైలర్ పిక్చర్ మొత్తం చూస్తుంటే మాత్రం కళ్యాణ్ రామ్ భారీగా ఖర్చు పెట్టేసాడనడంలో మాత్రం అతిశయోక్తిలేదు. ఇక ఈ ట్రైలర్ అంతా ఎన్టీఆర్ జై వన్ మ్యాన్ షో అనడంలో ఎటువంటి అనుమానం సందేహం మాత్రం లేదు. ఎందుకంటే జై పాత్ర రావణుడిలా వికటాట్టహాసమైన నవ్వుతోనే ఎన్టీఆర్ జై పాత్ర ఈ సినిమాకి వెన్నుముక అనేది పూర్తిగా అర్ధమయ్యింది.