అనుపమ పరమేశ్వరన్ తెలుగులోకి అడుగుపెడుతూనే 'అ.... ఆ' సినిమాతో హిట్ అందుకుంది. ఆ సినిమా తరవాత 'ప్రేమమ్, శతమానం భవతి'ల హిట్ తో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమాల తర్వాత అనుపమకు రామ్ చరణ్ సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయినప్పటికీ..... రామ్ తో 'ఉన్నది ఒకటే జిందగీ'లో ఆఫర్ చేజిక్కించుకుని బిజీ అయ్యింది. అలాగే నాని సరసన 'కృష్ణార్జున యుద్ధం', నాగ చైతన్య సరసన 'సవ్యసాచి' సినిమాల్లో కూడా ఎంపిక అయినట్లుగా చెబుతున్నారు. ఈ మలయాళ భామ మాత్రం తన సినిమాల్లో తన తెలుగు డబ్బింగ్ ని తానే చెప్పుకుంటుంది.
'అ.... ఆ' సినిమాలో నే సొంత గొంతుతో తెలుగు డబ్బింగ్ చెప్పిన అనుపమ తన మిగతా సినిమాల్లో కూడా తన గొంతునే వాడుకుంది. ఇక ఇప్పుడు రామ్ తో కలిసి నటించబోయే 'ఉన్నది ఒకటే జిందగీ' కోసం డబ్బింగ్ చెప్పుకోవడానికి తెలుగుని మరింత పర్ఫెక్ట్ గా నేర్చుకుంటుంది. మరింత స్పష్టమైన తెలుగులో మట్లాడాలి అంటే గనక తెలుగుపై పట్టు సాధించాలని అనుపమ ఈ నిర్ణయం తీసుకుందట. మరి టాలీవుడ్ భామలు టాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతున్నప్పటికీ వారు మాత్రం తమ గొంతుకి అరువు గొంతునే నమ్ముకుంటారు. ఇండస్ట్రీలోకొచ్చి దశాబ్దాలు దాటినా తెలుగు నేర్చుకోకుండా అరువు గొంతులు మీదే ఆధార పడతారు. మరి వాళ్లందరికన్నా ఈ అనుపమ చాలా బెటర్ కదండీ.