కొన్ని చిత్రాలలోని పాటలు విన్నవెంటనే ఇన్‌స్టాంట్‌గా బాగా అనిపించవు. వింటూ వింటూ ఉండగా దానిలోని కిక్ బాగా ఎక్కుతూ ఉంటుంది. అలాంటి ట్యూన్స్ అందించడంలో ఏఆర్‌రెహ్మాన్ ముందుంటాడు. ఆయన అందించే ట్యూన్స్ ఎంతో స్లో పాయిజన్‌గా మెదడుకు చేరుతాయి. తాజాగా హరీష్‌జైరాజ్ 'స్పైడర్'చిత్రం కోసం అందించిన ట్యూన్స్ కూడా ఇలాగే ఉన్నాయి. ఇక కొన్ని సాంగ్స్ వినడానికి పెద్దగా ఆకట్టుకోవు. కానీ ఆ పాట చిత్రీకరణ, విజువల్స్ వెండితెరపై కనిపించే సమయంలో అవి అందరినీ మ్యాజిక్‌ని చేసేస్తాయి.
విషయానికి వస్తే మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ఈనెల 27న తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా మహేష్ తొలిసారిగా నేరుగా తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం మొదటి టీజర్, రెండో టీజర్‌తో పాటు 'బూమ్ బూమ్, హాలి.. హాలి' పాటల ప్రమోలు విడుదలైనప్పుడు అందరూ పెదవి విరిచారు.'హాలి... హలి' పాట తమిళ వాసనలతో నిండి ఉందని, మొత్తానికి అనుకున్న స్థాయిలో మాత్రం టీజర్లు, పాటలు లేవని మహేష్ వీరాభిమానులు, సామాన్య తెలుగు ప్రేక్షకులు పెదవివిరిచారు. తాజాగా చెన్నైలో జరిగిన ఆడియో వేడుక వరకు ఇదే పరిస్థితి.
కానీ ఈ ఒక్క వేడుకతో 'స్పైడర్'పై ఉన్న నెగటివ్‌లన్నీ పాటిజివ్‌లుగా మారిపోయాయి. బ్యాడ్‌టాక్ తెచ్చుకున్న అన్ని యూటర్న్ తీసుకుని పాజిటివ్ బజ్‌తో నిండిపోయాయి. ఇప్పుడిప్పుడు హరీష్ జైరాజ్ స్వరపరిచిన పాటలు మెల్లగా కిక్‌ని అందిస్తున్నాయి. ఏ పాటలైతే బాగా లేవని భావించామో, ఈ పాటల వీడియో టీజర్లు బయటికి వచ్చేసరికి పరిస్థితి తల్లకిందులైంది. పాటలు విజువల్‌గా కనువిందుగా ఉంటూ పాటల సక్సెస్‌లో తమవంతు పాత్రను పోషిస్తున్నాయి. మరి ఈ మేనియా సినిమా రిలీజ్ లోపు ఏ స్థాయికి చేరుతుందో వేచిచూడాల్సివుంది..!