'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్ నేషనల్ వైడ్ స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రం తర్వాత ఆయన తమ యువిక్రియేషన్స్ బేనర్‌లోనే వంశీ, ప్రమోద్‌లు నిర్మాతలుగా 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఏకంగా 150కోట్ల భారీ బడ్జెట్‌తో 'సాహో' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం కోసం బాలీవుడ్‌కి చెందిన నీల్ నితిన్, జాకీష్రాఫ్, చుంకీ పాండేలతో పాటు శ్రద్దాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రం పక్కాయాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనుందని, ఇదో యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా ప్రభాస్ ఇప్పటికే 'సాహో'ని కన్‌ఫర్మ్ చేశాడు. శంకర్ -ఎహసన్-లాయ్‌తో పాటు ఈ చిత్రంలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ని తీసుకొస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరోయిన్ శ్రద్దాకపూర్ కేవలం గ్లామర్‌కి, పాటలకే పరిమితం కావడం లేదు.
ఇందులో రెండు కీలక పాత్రల్లో ఆమె ద్విపాత్రాభినయం చేయనుంది. అందులో ఓ పాత్ర అచ్చమైన తెలుగు అమ్మాయిగా, అమాయకమైన పాత్రలో కనిపించనుండగా, మరో పాత్రలో ఆమె రఫ్ అండ్ టఫ్‌గా ఉండే పాత్రలో నటించనుంది. ఈ పాత్రకు సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం. మొత్తానికి ఇందులో శ్రద్దాకపూర్‌కి కీలక పాత్ర రావడంతో ఆమె తన గ్లామర్‌తో పాటు యాక్షన్ పార్ట్ ద్వారా కూడా అన్ని వుడ్‌ల ఆడియన్స్‌ని ఎలా ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది..!