Advertisementt

ఎన్టీఆర్ భారీగా లాస్ అవుతాడా..?

Sun 10th Sep 2017 07:56 PM
jr ntr,jai lava kusa,pawan kalyan,trivikram srinivas  ఎన్టీఆర్ భారీగా లాస్ అవుతాడా..?
Jr NTR Jai Lava Kusa Movie After Update ఎన్టీఆర్ భారీగా లాస్ అవుతాడా..?
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు 'జై లవ కుశ' తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా వున్నాడు. 'జై లవ కుశ'తో రికార్డులు క్రియేట్ చెయ్యడానికి సిద్ధంగా వున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే హైయ్యెస్ట్ గా 100  కోట్ల పైమేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక 'జై లవ కుశ' విడుదలకు కేవలం మరో 10  రోజుల టైం మాత్రమే వుంది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్టీఆర్ ఆఘమేఘాల మీద ఈ సినిమాని కంప్లీట్ చేశాడు. అస్సలు షూటింగ్ కి గ్యాప్ లేకుండా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. 

మరోపక్క బుల్లితెర మీద బిగ్ బాస్ షోతో కూడా యమా బిజీగా ఉంటున్నాడు. అయితే ఎప్పుడూ తన సినిమాలను ఇన్ టైం లో కంప్లీట్ చేసి విడుదలకు సిద్ధం చేసే ఎన్టీఆర్ 'జై లవ కుశ' విషయంలోనూ అలాగే సెప్టెంబర్ 21 న అనుకున్న టైం కే కంప్లీట్ చేసేసి విడుదల చేస్తున్నాడు. ఇకపోతే 'జై లవ కుశ' తర్వాత ఎన్టీఆర్ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండబోతుంది. మరి ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే టైం త్రివిక్రమ్, పవన్ సినిమా నుండి బయటికి వచ్చే ఛాన్స్ లేదు. పవన్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న పవన్ 25 వ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదలకి సిద్ధం చేస్తున్నారు. అంటే షూటింగ్ కంప్లీట్ కావడానికి మరో మూడు నెలలు ఖచ్చితంగా పడుతుంది.

అంటే ఎన్టీఆర్ ఖాళీ అయినప్పటికీ త్రివిక్రమ్ ఫ్రీ అవడు కాబట్టి ఈ మూడు నెలలు ఎన్టీఆర్ ఖాళీగా కూర్చుంటే గనక భారీగా లాస్ అవుతాడు. ఎందుకంటే ఎన్టీఆర్ బుల్లితెర మీద చేస్తున్న బిగ్ బాస్ కూడా మరో 10  రోజుల్లో పూర్తవుతుంది. మరి త్రివిక్రంతో సినిమా చెయ్యాలి అంటే ఎన్టీఆర్ మూడు నెలలు వెయిట్ చేస్తాడా లేకుంటే దిల్ రాజు చెప్పిన శ్రీనివాస కళ్యాణం కథకి కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఆ సినిమాని ఏమన్నా పట్టాలెక్కించే ఛాన్స్ ఉందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే దిల్ రాజు నిర్మాతగా చేసే సినిమాకి ఎన్టీఆర్ దర్శకుడు సతీష్ వేగేశ్న అయితే వద్దని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. చూద్దాం ఎన్టీఆర్ ఈ మూడు నెలలలో ఏం చెయ్యబోతున్నాడో?

Jr NTR Jai Lava Kusa Movie After Update:

Jr NTR acted movie Jai Lava Kusa this movie releasing coming soon.After jai lava kusa movie jr NTR to team up wuth director trivikram srinivas for action entertainment but trivikram srinivas busy with PSPK 25 movie.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ