Advertisementt

తెలుగు హీరో తమిళంలో దున్నేశాడు..!

Sun 10th Sep 2017 07:24 PM
mahesh babu,ar murugadoss,spyder movie,tamil spyder audio released,mahesh babu speech  తెలుగు హీరో తమిళంలో దున్నేశాడు..!
Superstar Mahesh Babu Speech in Tamil తెలుగు హీరో తమిళంలో దున్నేశాడు..!
Advertisement
Ads by CJ

గత రాత్రి అంటే శనివారం రాత్రి 'స్పైడర్' ఆడియో వేడుక చెన్నై లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకి తమిళ పరిశ్రమనుండి చాలా మంది అతిధులు హాజరయ్యారు. దర్శకుడు మురుగదాస్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ బాబు, విశాల్ వంటివారితో ఆడియో వేడుక కళకళలాడింది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ 'స్పైడర్' ఆడి వేడుక మొత్తం మీద మహేష్ అందరికన్నా హైలెట్ అయ్యాడు. ఆడియో వేడుకలో వేదిక మీద మాట్లాడిన ప్రతి ఒక్కరు మహేష్ అందాన్ని పొగిడేశారు. ఇక మహేష్ కూడా స్పష్టమైన తమిళ భాషలో మాట్లాడి తమిళుల మనసు గెలుచుకున్నాడు. అస్సలు తడబడకుండా తమిళం ఎంతో చక్కగా మాట్లాడిన మహేష్ ని స్పైడర్ ఆడియో కి యాంకరింగ్ చేసిన సింగర్ చిన్మయి, మహేష్ బాబు ని ఒక ప్రశ్న ఆడబోయేసరికి వెంటనే మహేష్ అందుకుని ఏయ్ ఏంటి సమంత వచ్చేసింది అనుకున్నా అంటూ పంచ్ పేల్చడంలో అక్కడున్న అందరూ తెగ నవ్వేశారు. చిన్మయిని మహేష్ అలా సమంత గా వర్ణించడానికి కారణం సమంతకి చిన్మయి సినిమాల్లో డబ్బింగ్ చెబుతుంది కాబట్టి.

ఇక ఈ వేడుకలో దర్శకుడు మురుగదాస్.. మహేష్ బాబు గురించి మాట్లాడుతూ మహేష్ ని బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ తో పోల్చాడు. అమీర్, మహేష్ పని విషయంలో ఇద్దరు ఇద్దరే అంటూ గొప్పగా పొగిడేశాడు. మురుగదాస్ గతంలో బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో 'గజినీ' సినిమా చేసి ఉన్నాడు. అందుకే మహేష్ తో 'స్పైడర్' సినిమాలో వర్క్ చేస్తుంటే 'గజినీ' టైం లో అమీర్ తో పని చేసిన ఫీలింగ్ కలిగింది అంటూ చెప్పాడు. ఇకపోతే మహేష్ 'స్పైడర్' చిత్ర షూటింగ్ కోసం 80  రోజులపాటు నైట్ షూటింగ్ కి సహకరించాడని.. అలాంటి టైం లో మహేష్ సహకారం మర్చిపోలేనిది అంటూ చెప్పుకొచ్చాడు.

అసలు మహేష్ సూపర్ స్టార్ లా ఏనాడు ప్రవర్తించలేదని..... ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్షీట్స్ సర్దుబాటు చేసి చిత్ర బృందానికి సహకరించాడని మహేష్ ని పొగిడేశాడు. ఇక 'స్పైడర్' ఆడియో లాంచ్ తమిళంలో ఘనంగా జరిగింది కాబట్టి..... ఇక్కడ హైదరాబాద్ లో 'స్పైడర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా అదిరిపోయే లెవల్లో చెయ్యడానికి నిర్మాతలు సెప్టెంబర్ 15 న ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.  

Superstar Mahesh Babu Speech in Tamil:

Spyder Movie Audio Released in Tamil yesterday, Mahesh babu Speech totally tamil language.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ